ఆంధ్రప్రదేశ్ లో మనుషుల కన్నా అవే ఎక్కువ ఉన్నాయి

ఒక సమయంలో వీధిలో ఒక్క ఫోన్ ఉంటేనే అది గొప్ప విషయం.ఆ తరువాత ఇంట్లో ఒక ఫోన్ ఉంటే చాలు అనుకునేవారు.

 Andhra Pradesh Has More Mobile Connections Than It’s Population-TeluguStop.com

మరి ఇప్పుడో ? అవసరాలకి స్మార్ట్ ఫోన్లు, మాట్లాడడానికి చిన్నసైజు ఫోన్లు వాడేస్తున్నారు.ఇంట్లో ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉండటమే కాదు, ఒక్కొక్కరి దగ్గర రెండేసి మూడేసి ఫోన్లు ఉంటున్నాయి.

అందుకు కారణం టెలికాం నెట్వర్క్ అందరికి అందుబాటులోకి రావడమే.

ఇప్పుడు 5 రూపాయల్లో కూడా సిమ్ కనెక్షన్ దొరికేస్తోంది.మొబైల్ కి కొత్త సిమ్ కనెక్షన్ తీసుకోవడం అంటే మంచి నీళ్ళు తాగినంత ఈజీ అయిపోయింది.అందుకే వినియోగదారుల విపరీతంగా పెరిగిపోతున్నారు.

ఒక్కరే రెండు మూడు మొబైల్స్ తో పాటు నాలుగైదు నంబర్లు వాడుతున్నారు.

అందుకే ఆంధ్రప్రదేశ్‌లో మనుషుల కంటే మొబైల్ ఫోన్లే ఎక్కువున్నాయట.ఈ తెలుగురాష్ట్రం జనాభా 4.90 కోట్ల దాకా ఉంటే మొబైల్ కనెక్షన్లు మాత్రం 7.50 కోట్ల దాకా ఉన్నాయట.ఇక టోటల్ కనెక్షన్లను తీసుకుంటే ఉత్తరప్రదేశ్ మొదటిస్థానంలో, మహరాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, బీహార్‌ తరువాతి స్థానాల్లో నిలిచాయి.భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరగనుందని, రాబోయే రెండేళ్ళలో 1.50 బిలియన్లకు పైగా మొబైల్ కనెక్షన్లు మనదేశంలో ఉంటాయని, ఈరకంగా దేశ జనాభా కంటే మొబైల్ కనెక్షన్లే ఎక్కువ ఉండబోతున్నాయని నిపుణుల చెప్పుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube