షాకింగ్ - యువకుడిలో గర్భసంచి, అండాశయం కనపించాయి

అప్పుడప్పుడు ఇలాంటి వింతలు జరుగుతుంటాయి.మగవాడిలో గర్భసంచి, అండాశయం కనబడటం ఏంటి విడ్డూరం కాకపోతే.

 Andhra Pradesh Doctors Found Ovary In Man’s Body-TeluguStop.com

ఈ వింత చిత్తూరు జిల్లా, కుప్పంలో జరిగింది.

వివారాల్లోకి వెళితే, తమిళనాడులోని ఇటుకపల్లికి చెందిన యువకుడు అమరేష్ (23) గత కొన్ని రోజులుగా కుడి వృషణంలో నొప్పితో బాధపడుతున్నాడు.

నొప్పి తీవ్రంగా మారడంతో కుప్పంలోనీ శ్రీప్రియ నర్సింగ్ హోమ్ లో చేరాడు.శస్త్రచికిత్స చేసిన డాక్టర్లకి పెద్ద షాకే తగిలింది.

విచిత్రంగా అతని శరీరంలో గర్భసంచి, అండాశయం కనిపించాయి.ఇన్నిరోజులు వృషణం చేయాల్సిన పని అండాశయం చేసిందట.

వృషణం ఉండాల్సిన స్థానం కూడా ఖాలిగా ఉండటంతో మరింతగా నివ్వెరపోయారు.

అతను చిన్ననాటి నుండి ఇంగ్యూనియల్ హెర్నియా తో బాధపడుతున్నాడని, అందుకే శరీరం ఇలా తయారయ్యిందని చెప్పారు డాక్టర్లు.

మొత్తం మీద శస్త్రచికిత్స పూర్తి చేసి గర్భాశయాన్ని, అండాశయాన్ని తొలగించారు.

ఈ అరుదైన కండిషన్ ని “పెర్సిస్టెంట్ ముల్లేరియన్ డక్ట్” అని అంటారని, అయితే చింతించాల్సిన విషయం ఏం లేదని, అమరేష్ ఇకనుంచి సాధారణ జీవితం గడపడమే కాకుండా, పెళ్ళి చేసుకోని, పిల్లల్ని కూడా కనొచ్చని డాక్టర్ సుధీర్ చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube