ఏపీ కేబినెట్ మ‌ళ్లీ మారుతోందా..!

రెండేళ్ల‌లో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో.త‌న ఎన్నిక‌ల టీమ్‌పై సీఎం చంద్ర‌బాబు ఆందోళ‌న చెందుతున్నారు.

 Andhra Pradesh Cabinet Expansion Once Again-TeluguStop.com

ఎన్నో ఆశ‌లు, ఆకాంక్ష‌ల‌తో ఏర్పాటుచేసుకున్న కొత్త కేబినెట్.వాట‌న్నింటినీ కూల్చేసిందని తీవ్రంగా ఆవేద‌న ప‌డుతున్నారు.

ఎన్నో విమ‌ర్శ‌లు త‌ట్టుకుని సీనియ‌ర్ల‌ను సైతం కాద‌ని ఎంతో న‌మ్మ‌కంతో కొత్త‌వారికి మంత్రి ప‌దవులు క‌ట్ట‌బెడితే.ఆకాంక్ష‌ల‌కు ఆనుగుణంగా ప‌నిచేయ‌క‌పోవ‌డంతో తీవ్ర నిరుత్సాహ‌పడుతున్నార‌ట‌.

అంతేగాక సీనియ‌ర్లు కూడా పాల‌న‌లో ప‌నితనం చూప‌క‌పోవ‌డంతో.క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకోవాల‌ని నిశ్చ‌యించుకున్నార‌ట‌.

మ‌రోసారి కేబినెట్‌ను ప్ర‌క్షాళ‌న చేయాల్సిందే న‌ని డిసైడ్ అయిపోయార‌ట‌.

`సీఎం చంద్ర‌బాబుతో స‌మానంగా మంత్రులు ప‌రిగెత్త‌లేక‌పోతున్నారు.

వారికి కేటాయించిన శాఖ‌ల‌పై ఇంకా ప‌ట్టు సాధించ‌లేక‌పోతున్నారు`- ఈ మాట మూడేళ్లుగా ఎక్క‌డో ఒక చోట వినిపిస్తూనే ఉంది.కొత్త ర‌క్తాన్ని ఎక్కించేందుకు ప్ర‌యత్నించి.

ఆ ముద్ర‌ను చెరిపేయాల‌ని భావించారు.ఇదే ఎన్నిక‌ల టీంగా భావించారు.

కానీ మంత్రులెవ‌రూ ఆయ‌న ఆశించిన స్థాయిలో ప‌నిచేయ‌క‌పోవ‌డంతో ఏం చేయాలా అని తీవ్రంగా మంత‌నాలు జ‌రుపుతున్నార‌ట‌.మంత్రులుగా బాధ్య‌త‌లు చేప‌ట్టి మూడు నెల‌లు అయినా ఆశించిన స్థాయిలో ప‌నిచేయ‌డం లేద‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారని స‌మాచారం! ఇదే టీమ్‌తో ఎన్నిక‌ల‌కు వెళితే దెబ్బ‌తినే ప‌రిస్థితులు ఏర్ప‌డుతాయ‌ని ఆందోళ‌న చెందుతున్నార‌ట‌.

అందుకే ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గాన్ని మరోసారి విస్తరించాలని చంద్రబాబు భావిస్తున్న‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం! కొత్త కేబినెట్ పనితీరుపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అంత సంతృప్తిగా లేరని చెబుతున్నారు.శాఖల పై కూడా ఇప్పటి వరకూ కొందరు పట్టు సాధించకపోవడంతో మరోసారి మంత్రివర్గాన్ని విస్తరిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో అధినేత ఉన్నట్లు టీడీపీ వర్గాల సమాచారం.

ఇటీవ‌ల జ‌రిగిన విస్త‌ర‌ణ‌లో.ఒక‌రిద్ద‌రు సీనియ‌ర్లు త‌ప్ప మిగిలిన వారి శాఖ‌ల‌ను క‌దిలించే సాహ‌సం చేయ‌లేదు! కానీ ఇప్పుడు వారిపైనా వేటు త‌ప్ప‌ద‌ని తెలుస్తోంది.

ఇటీవల విస్తరించిన మంత్రివర్గం ఎన్నికల టీమ్ గా చంద్రబాబు భావించారు.అయితే ఇదే టీమ్ తో ఎన్నికలకు వెళితే దెబ్బ తింటామోనన్న ఆందోళనలో ఉన్నారట‌.

సీనియర్లు తన పనితీరుపై కూడా టీడీపీ నేతల వద్ద నెగిటివ్ గా మాట్లాడుతున్నట్లు సమాచారం అందింది.దీంతో ఈ కేబినెట్ తో ఎన్నికలకు వెళ్లలేమని భావించిన ముఖ్యమంత్రి మరోసారి విస్తరణ చేపట్టాలని, కొందరికి కేబినెట్ నుంచి ఉద్వాసన పలకాలని భావిస్తున్నట్లు పార్టీలో జోరుగా చర్చ నడుస్తోంది.

రెండేళ్ల స‌మ‌యం ఉండ‌టంతో క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకోక త‌ప్ప‌ద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.మరి ఇవి ఎంత వ‌ర‌కూ స‌త్ఫ‌లితాలిస్తాయో వేచిచూడాల్సిందే!!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube