ఆంధ్ర‌జ్యోతికి ఆయాసం వ‌చ్చిందా..!

ఏపీలో అధికార టీడీపీ ప్ర‌భుత్వానికి ఆంధ్ర‌జ్యోతి దిన‌ప‌త్రిక‌, మీడియా ఛానెల్ ఏ రేంజ్‌లో డ‌ప్పు కొడుతున్నాయో ? ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.తిమ్మిని బ‌మ్మిని చేయ‌డంలో ఆ ప‌త్రిక మ‌రీ బ‌రి తెగించేసింది.

 Andhra Jyothi Ki Ayasam Vachindi-TeluguStop.com

సాక్షి ఎలాగూ వైసీపీ, జ‌గ‌న్ అనుబంధ మీడియా అని ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.వాళ్లు వైఎస్ బొమ్మ పెట్టుకుని మ‌రీ డ‌ప్పుకొట్టుకుంటున్నారు.

జ్యోతి మీడియా అలా కాదు.తాము ఎవ‌రి ప‌క్షంకాదంటూనే టీడీపీకి భుజం కాస్తోంది.

ఇక నియోజ‌క‌వ‌ర్గాల పెంపుపై ఆంధ్ర‌జ్యోతి ఈ మూడేళ్ల‌లో రాసిన వార్త‌లు అన్ని ఇన్ని కావు.ఇత‌ర పార్టీల నుంచి, ముఖ్యంగా వైసీపీ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు సైకిలెక్కేలా చేయ‌డంతో జ్యోతి త‌న వంతు పాత్ర తాను పోషించింది.

నియోజ‌క‌వ‌ర్గాలు పెరిగి పోతున్నాయి.అదిగో.

ఇదిగో అంటూ ఆ బూచీ చూపించి, స‌గ‌టున నెలకు 15 వార్త‌ల‌కు పైగానే ప్ర‌చురించింది.

మెయిన్ పేప‌ర్‌తో పాటు జిల్లా పేప‌ర్ల‌లో కూడా అదే వార్త‌లు పుంఖాను పుంఖాలుగా రాసేశారు.

ఈ వార్త‌ల‌ను న‌మ్మి టెంప్ట్ అయ్యే వైసీపీ వాళ్లు టీడీపీలోకి రావ‌డ‌మే జ్యోతి టార్గెట్‌.ఓ వైపు నియోజ‌క‌వ‌ర్గాల పెంపు క‌ష్ట‌మే అన్న చ‌ర్చ‌లు న‌డుస్తున్నా జ్యోతి మాత్రం పెంపు అయిపోయింది, ఇక ప్ర‌క‌ట‌న త‌రువాయి అన్న చందంగా వార్త‌లు రాసేది.

ఈ వార్త‌ల విష‌యంలో రాసి రాసి జ్యోతి అల‌సిపోయిన‌ట్లుంది.

ఎట్ట‌కేల‌కు రామ్‌నాథ్ ప్ర‌మాణ స్వీకారానికి ఢిల్లీ వెళ్లిన ఇద్ద‌రు సీఎంలు ఈ విష‌యంలో చేతులెత్తేశారు.కేసీఆర్ మాత్రం నియోజ‌క‌వ‌ర్గాల పెంపు క‌ష్ట‌మే అన్న విష‌యాన్ని ప‌రోక్షంగా అంగీక‌రించారు.దీనిని జ్యోతి ప్ర‌చురించింది.

నియోజ‌క‌వ‌ర్గాల పెంపుపై కేసీఆర్ మాట్లాడుతూ దాని గురించి చెప్పకపోవడమే మంచిది.ఏదనుకుంటే అది దానంతట అదే జరిగిపోతుంద‌ని చెప్పారు.

దీంతో ఈ వార్త‌తో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయ నాయ‌కులు, సీఎంల క‌న్నా జ్యోతి బాగా డీలా ప‌డిన‌ట్టు క‌న‌ప‌డింది.

జ్యోతి ఊసూరోమంటూ ఈ వార్త‌ను ప్ర‌చురించింది.

అక్క‌డ నియోజ‌క‌వ‌ర్గాల పెంపుకు ఏ మాత్రం సానుకూల వాతావ‌ర‌ణం క‌న‌ప‌డినా ఇక్క‌డ జ్యోతి మ‌ళ్లీ రెచ్చిపోయేది.మ‌రీ ఈ ఒక్క వార్త‌నే మూడేళ్లుగా ప‌ట్టుకుని వేలాడూతోన్న జ్యోతికి ఆయాసం వచ్చిన‌ట్టే క‌న‌ప‌డుతోంది.

ఇక‌నైనా ఈ నియోజ‌క‌వ‌ర్గాల పెంపు వార్త‌ల‌కు ఫుల్‌స్టాప్ పెడుతుందేమో ? చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube