Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

  • WhatsApp

ఆంధ్ర‌జ్యోతికి ఆయాసం వ‌చ్చిందా..!-Andhra Jyothi Ki Ayasam Vachindi

ఏపీలో అధికార టీడీపీ ప్ర‌భుత్వానికి ఆంధ్ర‌జ్యోతి దిన‌ప‌త్రిక‌, మీడియా ఛానెల్ ఏ రేంజ్‌లో డ‌ప్పు కొడుతున్నాయో ? ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. తిమ్మిని బ‌మ్మిని చేయ‌డంలో ఆ ప‌త్రిక మ‌రీ బ‌రి తెగించేసింది. సాక్షి ఎలాగూ వైసీపీ, జ‌గ‌న్ అనుబంధ మీడియా అని ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. వాళ్లు వైఎస్ బొమ్మ పెట్టుకుని మ‌రీ డ‌ప్పుకొట్టుకుంటున్నారు. జ్యోతి మీడియా అలా కాదు..తాము ఎవ‌రి ప‌క్షంకాదంటూనే టీడీపీకి భుజం కాస్తోంది.

ఇక నియోజ‌క‌వ‌ర్గాల పెంపుపై ఆంధ్ర‌జ్యోతి ఈ మూడేళ్ల‌లో రాసిన వార్త‌లు అన్ని ఇన్ని కావు. ఇత‌ర పార్టీల నుంచి, ముఖ్యంగా వైసీపీ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు సైకిలెక్కేలా చేయ‌డంతో జ్యోతి త‌న వంతు పాత్ర తాను పోషించింది. నియోజ‌క‌వ‌ర్గాలు పెరిగి పోతున్నాయి..అదిగో..ఇదిగో అంటూ ఆ బూచీ చూపించి, స‌గ‌టున నెలకు 15 వార్త‌ల‌కు పైగానే ప్ర‌చురించింది.

Continue Reading
To Top