యాంకర్ రష్మీపై చీప్ కామెంట్స్

సామాజిక వెబ్ సైట్ల వలన లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి.ముఖ్యంగా సెలబ్రిటీస్ తమ పనుల్ని ప్రమోట్ చేసుకోవడంతో పాటు రకరకాల చెత్త చూడాల్సి వస్తుంది.

 Anchor Rashmi Fires On Twitter Mocks-TeluguStop.com

ఎవరు ఎందుకు తిడతారో అర్థం కాదు.అసలు ఎవరు తిడుతున్నారో కూడా తెలుసుకోవడం కష్టమైపోతోంది.

ఇక హీరోయిన్లయితే చీప్ కామెంట్లు వినాల్సి వస్తుంది.తెలుగు యాంకర్, నటి, రష్మీ గౌతమ్ కి అలాంటి అనుభవమే ఎదురైంది.

గత కొన్ని చిత్రాల్లో, రష్మీ తాను పోషించిన పాత్రలకు తగ్గట్టుగా గ్లామర్ డోసు పెంచిన సంగతి తెలిసిందే.కొంతమంది ఆకతాయిలు ఈ టాపిక్ తో వచ్చి, రష్మీని సన్ని లియోన్ తో పోల్చుతూ ట్వీట్స్ చేశారు.

రష్మీ కోపంగా ఓ సమాధానం పడేసరికి దెబ్బకు సెట్ అయిపోయాడు ఆ యూజర్.

ఇంతేకాదు, రష్మీ ఇలాంటిది, అలాంటిది అంటూ రోజు తెగ రాసేస్తున్నారు తుంటరి వెధవలు.

తనపై ట్విట్టర్లో అల్లరి చేస్తున్నవారికి సమాధానమిచ్చింది రష్మీ.తనకు ఇష్టమైనట్లు ఉంటానని, తన చేస్తున్న సినిమాలకి తానే రాణిలాగా మారాలనుకుంటున్నాని నిర్భయంగా సమాధానమిచ్చింది రష్మీ.

అంతేకదా .ఎవరికో భయపడాల్సిన అవసరం రష్మీకి ఎక్కడుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube