పవన్‌తో అవకాశం వస్తే వదలను

హాట్‌ యాంకర్‌ అనసూయ ప్రస్తుతం నాగార్జున ‘సోగ్గాడే చిన్ని నాయనో’ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్న విషయం తెల్సిందే.ఈ అమ్మడు నాగార్జునకు మరదలుగా నటిస్తున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు ఇప్పటికే ప్రకటించారు.

 Anchor Anasuya Ready To Act With Pawan-TeluguStop.com

ఇకపై అనసూయ సినిమాల్లో వరుసగా నటించేందుకు ఓకే చెప్తాను అంటూ తాజగా ప్రకటించింది.గతంలో తనకు పలు ఆఫర్లు వచ్చాయని కాని కొన్ని కారణాల వల్ల ఆ సినిమాలకు నో చెప్పానని అనసూయ చెప్పుకొచ్చింది.

ఇక ఈ అమ్మడి మనస్సులో పవన్‌ సినిమా ఆలోచన కూడా ఉన్నట్లుగా ఆమె మాటల ద్వారా అర్థం అయ్యింది.

పవన్‌ కళ్యాణ్‌తో ‘అత్తారింటికి దారేది’ సినిమాలో నటించే అవకాశం వచ్చినప్పటికి ఈ అమ్మడు కాదని చెప్పింది.

అయితే తాజాగా ఈమె మరోసారి పవన్‌ కళ్యాణ్‌తో అవకాశం వస్తే వదిలేది లేదని చెప్పుకొచ్చింది.పవన్‌ సినిమాలో హీరోయిన్‌ అయినా, చిన్న పాత్ర అయినా చేసేందుకు తాను సిద్దంగా ఉన్నానంటూ ఈమె ప్రకటించింది.

మరి పవన్‌ కళ్యాణ్‌ ఈ హాట్‌ యాంకర్‌ కోరిక తీర్చుతాడేమో చూడాలి.ప్రస్తుతం అనసూయ టీవీ షోలతో పాటు సినీ కార్యక్రమాలకు యాంకర్‌గా వ్యవహరిస్తూనే సినిమాల్లో నటిస్తూ ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube