ఒంటినొప్పులు, గాయాల నొప్పులకి ఈ టాబ్లెట్ వేసుకోండి

మోకాళ్ళు బాగా లాగుతున్నాయి.కాళ్ళు లాగేస్తున్నాయి.

 An Efficient Pain Killer You Could Use To Treat Pains-TeluguStop.com

చెవినొప్పి, పంటినొప్పి, నడుమునొప్పి, చేతికి, మొకాలికో, నడుముకో గాయం అయ్యింది, పీరియడ్స్ లో క్రామ్ప్స్, నొప్పులు .ఇవన్ని కాదు, ఇంకేదో భరించలేని నొప్పి.ఈ నొప్పుల నుంచి ఉపశమనం పొందాలంటే ఓ టాబ్లెట్ ఉంది.వేసుకున్న ఓ గంటకే ప్రభావం చూపడం మొదలుపెడుతుంది.నెమ్మదినెమ్మదిగా ఉన్న నొప్పి 50% నుంచి 60% వరకు కొన్ని గంటల్లోనే తగ్గుతుంది.

ఆ టాబ్లెట్ పేరే IBUPROFEN.

ఇది ఒక పెయిన్ కిల్లర్.ఇది ఒక nonsteroidal anti-inflammatory drug.

జ్వరాన్ని తగ్గిస్తుంది.మంటను తగ్గిస్తుంది.

నొప్పిని తీసివేస్తుంది.ఇది గాయాన్ని మాన్పించదు.

ఆ నొప్పిని మాత్రమే పొగుడుతుంది.ఉపశమనం కోసం క్రీడాకారులు వాడే పెయిన్ కిల్లర్స్ లో ఇది కూడా ఒకటి.

అలాగని చెప్పి ఈ టాబ్లెట్ ని ఎప్పుడు పడితే అప్పుడు వేసుకోకండి.ఇప్పటిదాకా చెప్పినదంతా నాణానికి ఒకవైపే.

మరోవైపు ఏముందో చూడండి.

ప్రతిచిన్న నొప్పికి దీన్ని వాడకూడదు.

క్రీడాకారులు కూడా ఎప్పటికప్పుడు వాడటానికి సాహసించరు.అత్యవసరం కోసం మాత్రమే వాడితే దీని వలన ఎన్ని లాభాలున్నాయో, ఇష్టం వచ్చినట్లు వాడితే, ప్రతి చిన్న నొప్పికి వాడితే అంతకంటే ఎక్కువ నష్టాలు ఉంటాయి.

హార్ట్ ఫేల్యూర్, కిడ్ని ఫేల్యూర్, లివర్ ఫేల్యూర్ కూడా జరగోచ్చు.ఆస్తమా పేషెంట్లు ఎక్కువ వాడితే ఆ సమస్య ఇంకా పెరగొచ్చు.

గర్భిణి స్త్రీలకి అయితే ఇంకా ప్రమాదం, బిడ్డ కడుపులోనే చనిపోవచ్చు కూడా.అంత పవర్ ఫుల్ మెడిసిన్ మరి.

కాబట్టి దీన్ని జాగ్రతగా వాడాలి.భరించలేని నొప్పి ఉన్నప్పుడు, నొప్పి నుంచి ఉపశమనం పొందడం కోసం వాడాలి.

రెగ్యులర్ గా వాడకూడదు.డాక్టర్ ని సంప్రదించి మాత్రమే వాడటం ఉత్తమం.

అతిగా వాడితే వాంతుల నుంచి కోమా వరకు ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి.అలాగని దీన్ని విషంలా చూడొద్దు.

సరిగా వాడితే ఔషధం.ఎప్పుడుపడితే అప్పుడే వాడితే విషం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube