బ్రిటిష్ భామ ఆమి జాక్సన్ జంతుసంరక్షణ సంస్థ పెటా ని ప్రమోట్ చేస్తోంది.పూర్తిగా మాంసాహారం మానేసిన ఆ బ్యూటి, అందరు మాంసాహారాన్ని మానేయ్యండి అంటూ సలహాలు ఇస్తోంది.
తన అందం యొక్క రహస్యం కూడా శాకహారమే అని అంటోంది.
పెటా క్యాంపేన్ కోసం ఓ ప్రమోషన్ వీడియో లో పాల్గొన్న ఆమీ “పూర్తిగా శాకాహారిగా మారటం వలన ఆరోగ్యంగా ఫీల్ అవుతున్నాను.
నా శరీరంలో కూడా చాలా మార్పు కనబడుతోంది.నా చర్మం చాలా క్లియర్ గా మారింది, నా మెటబాలిజం మెరుగుపడింది.
ప్రపంచంలో వాతావరణ మార్పుకి మీట్ ఇండస్ట్రి ఓ కారణం.అలాగే వారు జంతువులని ట్రీట్ చేసే తీరు చాలా ఘోరం.
ఓ రోజు కోడిలను తీసుకెళుతోంటే చూసాను, వాటి రెక్కలు గాయపడి ఉన్నాయి, ఎముకలు దెబ్బతిని ఉన్నాయి.చాలావరకు చనిపోయి ఉన్నాయి.
ఆరోగ్యకరమైన లైఫ్ స్టయిల్ కి మాంసాహరమే తినాల్సిన అవసరం లేదు.శాకహారులుగా మారండి.” అంటూ పిలుపునిచ్చింది ఆమి జాక్సన్.