నాగార్జున స్థానంలో మెగాస్టార్ ?

కొన్ని సినిమాల్ని బాక్సాఫీస్ లెక్కలతో కొలవలేం.పదికాలాలపాటు గుర్తుపెట్టుకోని , “క్లాసిక్” అనే టాపిక్ రాగానే అలాంటి సినిమా పేర్లు ఠక్కున చెప్పేస్తుంటాం.

 Amitabh To Replace Nagarjuna In Oopiri Remake?-TeluguStop.com

ఆ కోవకు చెందిందే “ఊపిరి”.ఫ్రెంచ్ ఫిలిమ్ “ది ఇంటచబుల్స్” కి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం, భారతీయ సినిమాకి అనుగుణంగా మారి, ప్రేక్షకుల మనసుల్ని హత్తుకుంది.

అంతమాత్రామే కాదు, బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది.

ఇప్పుడు ఈ చిత్రాన్ని హిందీలో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు బాలివుడ్ అగ్రనిర్మాత కరణ్ జోహర్.

ది ఇంటచబుల్స్ మన నేటివిటికి కాస్త దూరంగా ఉండటంతో, “ఊపిరి” ని రీమేక్ చేయడమే సరైనదని భావిస్తున్నారట కరణ్.హిందీ వెర్షన్ కి దర్శకుడు ఎవరు అనేది ఇంకా నిర్ణయించుకోలేదు.

అయితే అక్కినేని నాగార్జున పోషించిన పాత్రను అమితాబ్ బచ్చన్ తో చేయించే అలోచనలో కరణ్ జోహర్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.అలాగే కార్తి పాత్రను యువహీరో వరుణ్ ధవణ్, తమన్నా పాత్రను హిందీలో కూడా తమన్నాతోనే చేయించాలని కరణ్ జోహర్ భావిస్తున్నారట.

అన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube