మెగాస్టార్ పై నిందలు

మొన్న జరిగిన ఇండియా పాకిస్తాన్‌ టి-20 వరల్డ్ కప్ మ్యాచ్ కి మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా వచ్చి మన జాతీయగీతాన్ని ఆలపించిన సంగతి తెలిసిందే.అయితే జనగణమన ఆలపించడానికి అమితాబ్ బచ్చన్ 5-6 కోట్ల పేమెంట్ తీసుకున్నారని వార్తలు గుప్పుమన్నాయి.

 Amitabh Charged Nothing For Singing National Anthem-TeluguStop.com

అసలేం జరిగిందో తెలుసుకోకుండా, అమితాబ్ పై ఇష్టమొచ్చినట్లు కథనాలు తయారుచేసింది మీడియా .అమితాబ్ ని తెగ ఆడేసుకున్నారు ట్విట్టర్, ఫేస్ బుక్ జనాలు.భారతీయుల ఆశలు మోస్తూ అక్కడ వాళ్ళు ప్రపంచకప్ లో కష్టపడుతుంటే … ఈ పెద్దమనిషి జాతీయగీతాన్ని పాడటానికి అయిదారు కోట్లు తీసుకుంటాడా అంటూ అంతా అమితాబ్ మీద విరుచుకుపడ్డారు.మొత్తానికి ఈ వార్త అసత్యమని తేలిపోయింది.

భారత క్రికేట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలి స్వయంగా మీడియాతో మాట్లాడి .ఈ వార్తల్ని కొట్టిపడేసారు.అమితాబ్ సొంత ఖర్చులతో వచ్చి, సొంత ఖర్చులతో వెనుదిరిగారని .జాతీయగీతాన్ని పాడటానికి ఆయన డబ్బులెందుకు తీసుకుంటారని ప్రశ్నించాడు గంగూలి.నిజానికి, రానుపోను ఖర్చులు, వసతి ఖర్చులు కలుపుకోని అమితాబ్ కే 30 లక్షల ఖర్చు వచ్చిందట.

పాపం అమితాబ్ .మీడియా ఏదిపడితే అది రాసెయ్యడం .జనాలు ఏమి తెలుసుకోకుండా ఏదిపడితే అది అనెయ్యటం సర్వసాధారణం అయిపోయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube