టాలీవుడ్లో మెగాస్టార్‌గా చెక్కు చెదరని ఇమేజ్ క్రియేట్ చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వెండితెరకు పదేళ్ల పాటు దూరంగా ఉన్నా తన కం బ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ 150 సినిమాతో గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చాడు.ఖైదీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా రికార్డులకు పాతరేసింది.ఈ సినిమా రూ.105 కోట్ల షేర్ సాధించి టాలీవుడ్ వర్గాలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.
ఖైదీ ఇచ్చిన జోష్‌తో మెగాస్టార్ తన 151వ సినిమాకు రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే.ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
స్టైలీష్ డైరెక్టర్ సురేందర్‌రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను ఎక్కడా రాజీపడకుండా నిర్మించేందుకు నిర్మాత రాంచరణ్ సన్నాహాలు చేస్తున్నారు.
ఈ మెగాస్టార్ సినిమాలో మరో మెగాస్టార్ కీ రోల్ పోషిస్తున్నట్టు తెలుస్తోంది.
ఆ మెగాస్టార్ ఎవరో కాదు.బాలీవుడ్ బిగ్ బీ అమితాబచ్చన్.
ఇప్పటికే ఈ సినిమా కథను డైరెక్టర్ సురేందర్‌రెడ్డి అమితాబ్‌కు వివరించడంతో ఆయన ఈ చిన్న రోల్ చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.
అమితాబ్ మూడేళ్ల క్రితం తెలుగులో అక్కినేని ఫ్యామిలీ మూవీ మనం సినిమాలో ఓ చిన్న రోల్లో తళుక్కుమన్న సంగతి తెలిసిందే.
గతంలోనే చిరంజీవితో నటించాలని ఉందని చెప్పిన అమితాబ్ ఉయ్యాలవాడలో చిరు పక్కన స్క్రీన్ షేర్ చేసుకునేందుకు ఉత్సాహంగానే ఉన్నట్టు కనపడుతోంది.