మేకప్ మెన్ భార్య కు మెగాస్టార్ కాస్ట్ లీ గిఫ్ట్

బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.వయసుపైబడుతున్నా కూడా ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు.

 Amitabh Bachchan Costly Gift To Makeup Man Wife-TeluguStop.com

అయితే అమితాబ్ చూడడానికి ఎంత గంభీరం గా కనిపిస్తారో బయట ఆయన మనస్సు అంత సున్నితమయినది అని ఆయన ఫ్యాన్స్ చెబుతూ ఉంటారు.తన కోసం పని చేసే వాళ్ళను కూడా అమితాబ్ సొంత మనుషులు గా ట్రీట్ చేస్తూ ఉంటారు .అందుకే అవకాశం వచ్చినప్పుడల్లా వారికి బోనస్ లు ,రకరకాల బహుమతులు ఇచ్చి సర్ ప్రైజ్ చేస్తుంటారు

తాజాగా బిగ్ బి తన మెకప్ మెన్ కు ఓ అరుదైన గిఫ్టును అందించాడు.గిఫ్ట్ అంటే అలాంటి ఇలాంటి గిఫ్ట్ కాదు .అది ఏంటో తెలుసా…? రేంజ్ రోవర్ కారు.

అమితాబ్ పర్సనల్ మేకప్‌మన్ దీపక్ సావంత్ భార్య సరోద్‌కు ఎప్పటినుండో మంచి కార్ కొనుక్కోవాలని ఆశగా ఉందట .దీపక్‌కి పెద్దగా ఆసక్తి లేకపోయినా సరోద్‌కి మాత్రం కొత్తకారు కావాలని ఎప్పటినుంచో కోరికగా ఉందన్న విషయాన్ని మాటల మధ్యలో తెలుసుకున్న అమితాబ్.తాను తరచువాడే రేంజ్ రోవర్‌ని ఆమెకి కానుకగా ఇచ్చేశాడట.

దీపక్ దంపతులు తనకు అందిస్తున్న సేవలకు ఇది ప్రతిఫలమని అమితాబ్ చెప్పుకొచ్చారు .బిగ్ బి సాధారణంగా తన కార్లను మూడునాలుగేళ్లకోసారి అమ్మేస్తుంటాడు.2002లో ఈ రేంజ్ రోవర్ కారును కొన్నాడు బిగ్ బి .రేంజ్ రోవర్ లాంటి ఖరీదు అయిన కార్ ను గిఫ్ట్ గా ఇవ్వడం తో అమితాబ్ హృదయం ఎంత విశాలమయినదో అని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube