నేరేడుపండ్లలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు

నేరేడుపండ్లు రుచితో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.నేరేడు పండులో చాలా రకాలైన సూక్ష్మపోషకాలు,20 శాతం ఫైబర్‌,విటమిన్లు, మినరల్స్‌,యాంటి ఆక్సిడెంట్స్,విటమిన్‌ ఎ,సి, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి.

 Amazing Health Benefits And Uses Of Jamun Fruit-TeluguStop.com

అందువల్ల నేరేడుపండ్లు అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారంగా చెప్పుతారు.

గుండె జబ్బులున్నవారు నేరేడుపండ్లు తింటే చాలా మంచిది.

గుండె పని సామార్థ్యాన్ని పెంచే శక్తి నేరేడు పండ్లకు ఉంది.వీటిలో ఉండే సాలసిలేట్ ఆమ్లం గుండె జబ్బుల నివారణలో తోడ్పడుతుంది.

అస్పిరిన్‌తో సమానంగా ఇది పనిచేస్తుందని అధ్యయనాల్లో తేలింది.ఈ సాలసిలేట్ నొప్పి నివారకంగా కూడా ఉపయోగపడుతుంది.

నేరేడు పండ్లలో టానిన్లు ఎక్కువగా ఉంటాయి.కాబట్టి ఇవి మంచి యాంటి సెప్టిక్‌గా పనిచేస్తాయి.కణాలు వదులుగా లేకుండా దగ్గరికి ఉండేలా చిన్న చిన్న రక్తస్రావాలను కూడా అడ్డుకుంటాయి.రక్తం గడ్డ కట్టే ప్రక్రియను వేగవంతం చేస్తాయి.

అధిక రక్తస్రావాన్ని కూడా తగ్గిస్తాయి.

నేరేడు పండ్లను రోజూ తీసుకుంటే ఊపిరిత్తుల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు, అలర్జీలు రాకుండా సహాయపడుతుంది.ముఖ్యంగా అస్తమా పేషెంట్లకి చాలా బాగా సహాయపడతాయి.

నేరేడులో అధిక ఫైబర్ ఉండుట వలన జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.మలబద్దకం దరి చేరదు.

మలబద్దకం లేనప్పుడు పైల్స్‌ లాంటి సమస్యలు రావు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube