సపోటా తింటూ ఉండాలి .. ఎందుకో తెలుసుకోండి

మన పెరట్లో కనిపించే ఫలాల్లో సపోటా ఒకటి.దీన్ని చికూ అని కూడా అంటారు.

 Amazing Benefits Human Body Gets From Sapota-TeluguStop.com

సపోటా త్వరగా శక్తినిచ్చే ఫలం.ఎందుకంటే దీంట్లో ఫ్రక్టోస్ మంచి మోతాదులో దొరుకుతుంది.యాంటిఆక్సిడెంట్స్ కూడా ఎక్కువే.మరి చాలా సులువుగా దొరుకే సపోటా ఎన్నోరకాలుగా మన శరీరానికి ఉపయోగపడుతుందో చూద్దామా!

* ఒక్క సపోటాలో 141 కాలారీలు, పిండిపదార్ధము 33.93 గ్రాములు, ప్రోటిన్లు 0.75 గ్రాములు, ఫైబర్ 9.01 గ్రాములు ఉంటుంది

* దీంట్లో పొటాషియం, సెలెనియం, మెగ్నీషియమ్, ఐరన్, కాల్షియం, సోడియం, జింక్ లాంటి మినరల్స్ దొరుకుతాయి

* అలాగే విటమిన్ ఏ,సి, బి6, ఫోలిక్ ఆసిడ్, విటమిన్ కే, ,విటమిన్ బి12 లభిస్తాయి.అంతేకాదు, ఒంటికి అవసరమైన అమినో ఆసిడ్స్ కూడా సపోటా సొంతం

* సపోటాలో ఉండే విటమిన్ ఏ కంటిచూపుకి మంచిది.

ఇందులో ఉండే విటమిన్ సి రోగనిరోధకశక్తిని పెంచుతుంది.కాల్షియం ఎముకల బలాన్ని పెంచుతుంది

* సపోటా తక్షణశక్తిని అందిస్తుంది.ఇందులో ఉండే ఫ్రక్టోస్ లెవెల్స్, ప్రోటీన్‌లు ఆ శక్తికి కారణం.ఏమాత్రం అలసటగా అనిపిపించినా ఓ మూడు నాలుగు సపోటాలను తినడం మంచిది

* తెనేతో పాటు సపోటాను సేవిస్తే శృంగార సమస్యలను దూరం పెట్టవచ్చును.

శీఘ్రస్కలన సమస్యలకు, శృంగార సామర్థ్యం పెంచుకోవడానికి సపోటా, తేనేల కలయిక ఉపయోగకరం

* రక్తహీనతతో బాధపడేవారు కూడా సపోటాను తింటూ ఉండాలి.అయితే, షుగర్ లెవెల్స్ తో బాధపడేవారు మాత్రం కాస్త ఆలోచించి తినాలి.

డాక్టర్ ని సంప్రదించి ఎంత తినాలో తెలుసుకుంటే మంచిది

* ఫైబర్ కంటెంట్ కూడా ఉండటం వలన ఇది జీర్ణక్రియను క్రమబద్ధంగా ఉంచుతుంది.అంతేకాదు, ఇందులో యాంటి ఫంగల్, యాంటి బ్యాక్టీరియా లక్షణాలు కూడా ఉంటాయి.

ఎదిగే పిల్లలకు సపోటా తినిపిస్తూ ఉండటం మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube