సపోటా తింటూ ఉండాలి .. ఎందుకో తెలుసుకోండి-Amazing Benefits Human Body Gets From Sapota 3 months

Chikoo Digestion Fibre Honey Sexual Problems Sugar Levels Vitamin A C Photo,Image,Pics-

మన పెరట్లో కనిపించే ఫలాల్లో సపోటా ఒకటి. దీన్ని చికూ అని కూడా అంటారు. సపోటా త్వరగా శక్తినిచ్చే ఫలం. ఎందుకంటే దీంట్లో ఫ్రక్టోస్ మంచి మోతాదులో దొరుకుతుంది. యాంటిఆక్సిడెంట్స్ కూడా ఎక్కువే. మరి చాలా సులువుగా దొరుకే సపోటా ఎన్నోరకాలుగా మన శరీరానికి ఉపయోగపడుతుందో చూద్దామా!

* ఒక్క సపోటాలో 141 కాలారీలు, పిండిపదార్ధము 33.93 గ్రాములు, ప్రోటిన్లు 0.75 గ్రాములు, ఫైబర్ 9.01 గ్రాములు ఉంటుంది.

* దీంట్లో పొటాషియం, సెలెనియం, మెగ్నీషియమ్, ఐరన్, కాల్షియం, సోడియం, జింక్ లాంటి మినరల్స్ దొరుకుతాయి.

* అలాగే విటమిన్ ఏ,సి, బి6, ఫోలిక్ ఆసిడ్, విటమిన్ కే, ,విటమిన్ బి12 లభిస్తాయి. అంతేకాదు, ఒంటికి అవసరమైన అమినో ఆసిడ్స్ కూడా సపోటా సొంతం.

* సపోటాలో ఉండే విటమిన్ ఏ కంటిచూపుకి మంచిది. ఇందులో ఉండే విటమిన్ సి రోగనిరోధకశక్తిని పెంచుతుంది. కాల్షియం ఎముకల బలాన్ని పెంచుతుంది.

* సపోటా తక్షణశక్తిని అందిస్తుంది. ఇందులో ఉండే ఫ్రక్టోస్ లెవెల్స్, ప్రోటీన్‌లు ఆ శక్తికి కారణం. ఏమాత్రం అలసటగా అనిపిపించినా ఓ మూడు నాలుగు సపోటాలను తినడం మంచిది.

* తెనేతో పాటు సపోటాను సేవిస్తే శృంగార సమస్యలను దూరం పెట్టవచ్చును. శీఘ్రస్కలన సమస్యలకు, శృంగార సామర్థ్యం పెంచుకోవడానికి సపోటా, తేనేల కలయిక ఉపయోగకరం.

* రక్తహీనతతో బాధపడేవారు కూడా సపోటాను తింటూ ఉండాలి. అయితే, షుగర్ లెవెల్స్ తో బాధపడేవారు మాత్రం కాస్త ఆలోచించి తినాలి. డాక్టర్ ని సంప్రదించి ఎంత తినాలో తెలుసుకుంటే మంచిది.

* ఫైబర్ కంటెంట్ కూడా ఉండటం వలన ఇది జీర్ణక్రియను క్రమబద్ధంగా ఉంచుతుంది. అంతేకాదు, ఇందులో యాంటి ఫంగల్, యాంటి బ్యాక్టీరియా లక్షణాలు కూడా ఉంటాయి. ఎదిగే పిల్లలకు సపోటా తినిపిస్తూ ఉండటం మంచిది.

మీ కోసం సూచించబడిన ఈ హెల్త్ టిప్స్ చూడండి...కిడ్నీల్లో రాళ్ళు తీసేయడానికి ఒక జ్యూస్ ఉంది

About This Post..సపోటా తింటూ ఉండాలి .. ఎందుకో తెలుసుకోండి

This Post provides detail information about సపోటా తింటూ ఉండాలి .. ఎందుకో తెలుసుకోండి was published and last updated on in thlagu language in category AP Featured,Telugu Health,Telugu Health Tips.

Amazing benefits human body gets from Sapota, Chikoo, Vitamin A, Vitamin C, Honey, Sugar Levels, Fibre, Digestion, Sexual Problems

Tagged with:Amazing benefits human body gets from Sapota, Chikoo, Vitamin A, Vitamin C, Honey, Sugar Levels, Fibre, Digestion, Sexual ProblemsAmazing benefits human body gets from Sapota,Chikoo,Digestion,Fibre,honey,Sexual Problems,Sugar Levels,vitamin A,vitamin C,,