గీతా ఆర్ట్స్ టైటిల్ అసలు ట్విస్ట్ అదా..!,

అల్లు అరవింద్ నిర్మించిన గీతా ఆర్ట్స్ అంటే తెలియని సిని ప్రేక్షకుడు ఉండరు.తెలుగు సినిమా చరిత్రలో ఆ సంస్థకు ఓ ప్రత్యేక స్థానం ఉంది అయితే గీతా ఆర్ట్స్ కు ఆ టైటిల్ ఎందుకు పెట్టారు అంటే ఏముందు అల్లు అరవింద్ భార్య అదేనండి బన్ని మదర్ పేరు గీతా అయ్యుంటుంది అందుకే ఆ పేరు పెట్టారని ఇన్ని రోజులు అనుకున్నారు.

 Allu Sirish Revealed Geeta Arts Banner Twist-TeluguStop.com

కాని అల్లు వారి రెండో అబ్బాయి ఈ మధ్యనే శ్రీరస్తు శుభమస్తు అంటూ వచ్చి హిట్ కొట్టిన శిరీష్ అసలు ట్విస్ట్ రివీల్ చేశాడు.

అల్లు అరవింద్ గారికి భగవద్గీతలోని సారాంశం బాగా ఇన్స్ పైర్ చేసిందట.

అందుకే గీతా ఆర్ట్స్ అని ఆ పేరుతో ఓ నిర్మాణ సంస్థను నిర్మించారంటూ ఈరోజు కృష్ణాష్టమి విశెష్ తెలుపుతూ గీతా ఆర్ట్స్ అసలు కారణం చెప్పేశాడు.ఇక అందరు అనుకుంటున్నట్టు తన మదర్ పేరు గీతా కాదని నిర్మల అని చెప్పాడు శిరీష్.

సో అల్లు అరవింద్ ఏ ఆలోచనతో పెట్టారేమో కాని కొత్త నిర్మాణ సంస్థలు ఎన్ని వచ్చినా గీతా ఆర్ట్స్ ఎప్పుడు నెంబర్ వన్ ప్రొడక్షన్ హౌజ్ గా ఉంటూనే వస్తుంది.చిరంజీవికి మెగాస్టార్ గా చేసే తరుణంలో గీతా ఆర్ట్స్ సంస్థ ఎన్నో సూపర్ హిట్లు కొట్టింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube