ముందు నుంచి పవన్ కళ్యాణ్ కి అల్లు ఫ్యామిలికి కొంచెం అటూఇటూగా ఉండే సంబంధాలే ఉన్నాయి.అసలు అల్లు అరవింద్ తో సత్సంబంధాలు లేకపోవడం వలనే మెగాఫ్యామిలి ఫంక్షన్స్ కి పవన్ రావడం మానేసాడనే వార్తలు లేకపోలేదు.
ఇందులో నిజానిజాలు పక్కనపెడితే, అల్లు హీరోలు అర్జున్, శిరీష్ లకి మాత్రం పవర్ స్టార్ తో సరైన సంబంధాలు లేవని కొన్ని సంఘటనలతో ఇప్పటికే స్పష్టం అయ్యింది.
చెప్పను బ్రదర్ అంటూ అల్లు అర్జున్ స్టేట్ మెంట్ అప్పట్లో అలజడి సృష్టిస్తే, తాజాగా “విపిగాడు” అంటూ పవన్ మీద శిరీష్ చేసిన కామెంట్స్ వారిమీద పవన్ ఫ్యాన్స్ పగ పెంచుకునేలా చేసాయి.
దాంతో డీజే టీజర్ కి కుప్పలుకుప్పలుగా డిస్ లైక్స్ పడుతున్నాయి.ఇకనుంచి అల్లువారికి ఇలానే నరకం చూపిస్తామని స్పష్టం చేసారు పవర్ స్టార్ అభిమానులు.
ఈ తంతు ఇలానే నడిస్తే కష్టమని అల్లు అరవింద్ కి బాగా అర్థమయినట్లు ఉంది.అందుకే మెట్లు దిగేలా ఉన్నారు.
పవన్ కి క్షమాపణ చెప్పి, డిజే చిత్రానికి సంబంధించిన ఏదైనా ఒక పాటను పవన్ తో లాంచ్ చేయిస్తే ఆయన ఫ్యాన్స్ కొంచెం శాంతిస్తారేమో అని ఆలోచిస్తోందట అల్లు క్యాంప్.మరి ఈ విషయంపై పవన్ ని అడిగే ధైర్యం చేస్తారా? దానికి పవన్ కళ్యాణ్ స్పందన ఎలా ఉంటుంది అనేది ఆసక్తికరమైన విషయం.