అక్కడకు బన్నీ

టాలీవుడ్‌ స్టైలిష్‌ హీరో, స్టైలిష్‌ డాన్సర్‌ అల్లు అర్జున్‌ త్వరలో బాలీవుడ్‌లోకు వెళ్లబోతున్నాడు.అక్కడ ఈయన ఒక సినిమాలో మెరిసేందుకు సిద్దం అయ్యాడు.

 Allu Arjun’s Debut With Abcd 2 Hindi Film-TeluguStop.com

హీరోగా కాకుండా ఒక సినిమాలో ముఖ్య పాత్రలో తన టాలెంట్‌ను చూపించేందుకు బన్నీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు.బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ‘ఏబీసీడీ’(ఎనీబడీ కెన్‌ డ్యాన్స్‌)లో బన్నీ ఒక ముఖ్య పాత్ర పోషించడంతో పాటు ఒక పాటలో తన డాన్స్‌ను బాలీవుడ్‌ ప్రేక్షకులకు చూపించనున్నాడు.

గతంలో వచ్చిన ‘ఏబీసీడీ’కి ఇది సీక్వెల్‌.పలువురు స్టార్‌ డాన్సర్లు ఈ సినిమాలో కనిపించనున్నారు.

సౌత్‌ నుండి అల్లు అర్జున్‌ను ఈ సినిమా కోసం ఎంపిక చేసుకున్నట్లుగా దర్శకుడు రెమో డిసౌజా చెప్పుకొచ్చాడు.ఈ సినిమాలో ఇండియన్‌ మైకేల్‌ జాక్సన్‌ ప్రభుదేవా విలన్‌ పాత్రలో కనిపించనున్నాడు.

ఈయన డ్యాన్స్‌ టాలెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.బన్నీ బాలీవుడ్‌ ఎంట్రీ ఎలా ఉండబోతుంది అనే విషయం ఆసక్తికరంగా మారింది.

ఈ సినిమా జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube