ఏమిటి ఈ రౌడీయిజం అల్లు అర్జున్?

డీజే – దువ్వాడ జగన్నాథం సినిమాకి కలెక్షన్లు ఓ రెంజ్ లో వస్తున్నాయి.కాని ఈ బాక్సాఫీస్ రిపోర్టుల్లో చాలావరకు ఫేక్ పిగర్స్ ఉన్నాయని, అల్లు అర్జున్ అండ్ టీమ్ మీడియాని బాగా మేనేజ్ చేస్తూ, కలెక్షన్లు పెంచి చెబుతున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు పదే పదే ఆరోపిస్తున్నారు.

 Allu Arjun Team’s Rowdyism On Film Critics?-TeluguStop.com

ఇందులో నిజానిజాలు ఎంతో తెలియదు కాని, సినిమా రివ్యూలపై మాత్రం అల్లువారి బ్యాచ్ దండయాత్ర చేసేందుకు కొన్ని ప్రయత్నాలు చేసింది.

డీజే సినిమా మీద నెగేటివ్ రివ్యూ రాసిన ఓ ప్రముఖ రివ్యూ రైటర్ కి ఏకంగా బెదిరింపు కాల్స్ వెళ్ళాయి.

ఆ ఫోన్ చేసింది ఎవరో కాదు, అల్లు అర్జున్ సొంత మనిషే అంటున్నారు.అల్లు క్యాంప్ మీద ఇలాంటి పెద్ద పెద్ద ఆరోపణలు పుట్టడం ఇదేమి కొత్త కాదు.

పవన్ కళ్యాణ్ ని గురించి అల్లు శిరీష్ మెసెజ్ల లీకేజ్ వ్యవహారం, సరైనోడు ఫేక్ కలెక్షన్ల వార్తలు, ఇప్పుడు డీజేపై ఫేక్ కలెక్షన్ల ఆరోపణలు, కొత్తగా ఈ బెదిరింపు కాల్స్ గొడవ, ఇలాంటివి అల్లు క్యాంప్ మీదే ఎవరో కావాలని ప్లాన్ చేస్తున్నారో లేక యాదృచ్ఛికంగా జరుగుతున్నాయో మరి.

సరే, ఈ డిస్కషన్ కాసేపు పకన్న పెట్టి డిజే కెలెక్షన్ల రిపోర్టు గురించి మాట్లాడుకుంటే మొదటి మూడు రోజుల్లో 44 కోట్ల దాకా షేర్ వసూలు చేసింది ఈ సినిమా.బాహుబలి సీరిస్, ఖైదీ నం 150 తరువాత హయ్యెస్ట్ వీకెండ్ కలెక్షన్ ఈ సినిమాదే.ఈరోజు కూడా తెలంగాణలో సెలవులు ఉండటంతో సినిమా ఊపు ఈ వారమంతా కొనసాగేలా ఉంది.

పైగా పొటికి పెద్ద సినిమాలేవి లేవు.కాబట్టి డీజే బ్రేకీవేన్ పాయింట్ ని చేరుకోవడం పెద్ద కష్టమేమి కాదు.

అయితే శ్రీమంతుడుని దాటుతుందా, దాటి ఖైదీనం 150 దాకా వెళ్తుందా లేదా రెండోవారం చూస్తే తప్ప చెప్పలేం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube