అల్లు అర్జున్ తాజా చిత్రం ‘సన్నాఫ్ సత్యమూర్తి’.మరి ఈ సన్నాఫ్ అల్లు అర్జున్ ఏంటా అని ఆలోచిస్తున్నారా? విషయం ఏంటంటే.సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో బుల్లి స్టైలిష్ స్టార్ తన స్టైలిష్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అల్లు అయాన్ వెండి తెర ఎంట్రీ ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాతో జరుగబోతుందని విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది.
ఈ సినిమాలో అల్లు అయాన్ తలుక్కున మెరవబోతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా తెలుస్తోంది.
టైటిల్స్ పడే సమయంలో లేదా, సినిమా పూర్తి అయిన సమయంలో అల్లు అర్జున్ను ప్రేక్షకులకు చూపించే ఏర్పాట్లు దర్శకుడు త్రివిక్రమ్ చేస్తున్నాడని అంటున్నారు.
అల్లు అర్జున్, సమంత జంటగా నటిస్తున్న ఈ సినిమాను రాధాకృష్ణ నిర్మిస్తున్నాడు.‘జులాయి’ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలు ఇప్పటికే తారా స్థాయిలో ఉన్నాయి.ఇక ఈ సినిమాలో అల్లు అయాన్ ఉన్నాడనే వార్తలు రావడంతో అంచనాలు డబుల్ అయ్యాయి.దాంతో సినిమాకు భారీ క్రేజ్ వస్తోంది.
ఈ సినిమా ఆడియోను ఇదే నెల 15న మరియు సినిమాను వచ్చే నెల మొదటి వారంలో విడుదల చేయనున్నారు.