తమిళ హీరోలు పలువురు తెలుగులో స్టార్ హోదాను కలిగి ఉన్న విషయం తెల్సిందే.కాని తెలుగు హీరోలు మాత్రం తమిళంలో పెద్దగా ప్రభావం చూపడం లేదు.
గతంలో తెలుగు హీరోలు అసలు తమిళంపై ఆసక్తికనబర్చేవారే కాదు.కాని గత కొంత కాలంగా తెలుగు హీరోు సైతం తమిళంలో కూడా జెండా పాతాను తహతహలాడుతున్నారు.
మెగా హీరోలు రామ్‌చరణ్, అల్లు అర్జున్‌లతో పాటు మహేష్‌బాబు కూడా తన ప్రతి సినిమాను తమిళంలో విడుదల చేయాలని భావిస్తున్నాడు.
అల్లు అర్జున్ ఇప్పటికే మలయాళంలో క్రేజీ స్టార్ హీరోగా దూసుకు పోతున్నాడు.
అలాంటి అల్లు అర్జున్ ఇప్పుడు తమిళంలో రాణించాలని కోరుకుంటున్నాడు.ఈయన గతంలో నటించిన పలు తెలుగు సినిమాలు తమిళంలో విడుదల అయ్యాయి.
కాని ఇప్పటి వరకు తమిళంలో అల్లు అర్జున్‌కు సరైన గుర్తింపు రాలేదు.ప్రస్తుతం నటిస్తున్న ‘సరైనోడు’ చిత్రాన్ని కూడా తెలుగుతో పాటు తమిళంలో కూడా రిలీజ్ చేయించేందుకు బన్నీ ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఆ తర్వాత బన్నీ ప్రముఖ తమిళ దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటించేందుకు కమిట్ అయ్యాడు.ఆ సినిమా తెలుగు మరియు తమిళంలో తెరకెక్కించబోతున్నట్లుగా తెలుస్తోంది.
తమిళ మార్కెట్ కోసమే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో బన్నీ సినిమా చేయాలని నిర్ణయించుకున్నట్లుగా మెగా వర్గాల నుండి సమాచారం అందుతోంది.మరి బన్నీ చేస్తున్న ఈ ప్రయత్నం సక్సెస్ అయ్యేనో చూడాలి.