కన్నడ రీమేక్‌లో బన్నీ?

టాలీవుడ్‌ స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే.రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను అల్లు అరవింద్‌ నిర్మిస్తున్నాడు.

 Allu Arjun In Rangitarangaa Remake-TeluguStop.com

శరవేంగంగా రూపొందుతున్న ఈ సినిమాను వచ్చే సంవత్సరం ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఇదే సమయంలో అల్లు అర్జున్‌ మరో సినిమాకు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లుగా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది.

కన్నడంలో భారీ హిట్‌ అయిన ‘రంగి తరంగ’ చిత్రం రీమేక్‌లో నటించేందుకు తాజాగా బన్నీ ఓకే చెప్పాడనే వార్తలు వినిపిస్తున్నాయి.ఇటీవలే ఈ సినిమాను బన్నీ చూశాడని, మంచి కథ అవ్వడంతో పాటు ఇది తెలుగు నేటివిటీకి సరిగ్గా సూట్‌ అవుతుందనే ఉద్దేశ్యంతో బన్నీ ఈ రీమేక్‌ను చేస్తాను అంటూ హామీ ఇచ్చాడని తెలుస్తోంది.

ఒక కొత్త దర్శకుడి దర్శకత్వంలో తక్కువ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కే అవకాశాలున్నాయి.కన్నడంలో భారీ స్థాయిలో కలెక్షన్స్‌ను రాబట్టిన ‘రంగి తరంగ’ సినిమా తెలుగులో ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube