అల్లు అర్జున్ సరికొత్త రికార్డు

హీరోకి క్రేజ్ ఉంటేనే సరిపోదు .మంచి పిఆర్ టీం కూడా ఉండాలి.

 Allu Arjun Hits 1 Crore Likes On Facebook-TeluguStop.com

నటించడం, సినిమాకి బిజినెస్ తీసుకురావడం, ఓపెనింగ్స్ , టోటల్ కలెక్షన్స్ .ఇది హీరో స్టామినా.కాని ఏ సైట్ లో ఎలాంటి ఆర్టికల్స్ పడుతున్నాయి, ఆ ఛానెల్ లో మనగురించి కథనం వెలువడాలి, మన ఫేస్ బుక్ లైక్స్ ఎంత ఉండాలి .ఇదంతా పిఆర్ టీమ్ స్టామినా.అల్లు అర్జున్ టీంని మార్కెటింగ్ విషయంలో కొట్టేవారే లేరు.మన హీరోలందరికీ ఉన్న ఫేస్ బుక్ పేజీల్లో అల్లు అర్జున్ ఫేస్ బుక్ రూటే వేరు.ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఉంటాయి, సరైన వాడకం ఉంటుంది, ప్రమోషన్ ఉంటుంది.అందుకే ఫేస్ బుక్ వరకు బన్నియే నెం.1.

అల్లు అర్జున్ సరికొత్త రికార్డు సృష్టించాడు.తెలుగు హీరోల ఫేస్ బుక్ పేజీల్లో కోటి లైకులు సాధించిన మొదటి పేజి బన్నిదే.అల్లు అర్జున్ తరువాత రెండోస్థానంలో ఉన్న ప్రభాస్ లైక్స్ బన్నిదాంట్లో దాదాపు సగం.లెక్కల్లో చెబితే 53 లక్షలకు పైగా లైక్స్.చిత్రంగా, విచిత్రంగా మహేష్ బాబు 36 లక్షలు, రామ్ చరణ్ 31 లక్షలు దాటేసి చాలా వెనుకబడిపోయారు.

ఎన్టీఆర్ ఇంకా 28 లక్షల దగ్గరే ఉన్నాడు.సోషల్ మీడియా ఎలా వాడుకోవాలో బన్నికి, బన్ని పిఆర్ టీంకి తెలిసినంతగా మిగితా హీరోలకి తెలియదేమో.ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ది వేరే దారి.అసలు ఆయన ఫేస్ బుక్ వాడడమే లేదు.

ట్విట్టర్ వరకే పరిమితమైపోయాడు.

ఇవన్ని పక్కన పెడితే, కంగ్రాట్స్ బన్ని.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube