మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి నెలకొంది.గత కొన్ని రోజులుగా పెళ్లి వేడుకతో మెగా ఫ్యామిలీ అంతా కూడా చాలా బిజీబిజీగా గడుపుతోన్న విషయం తెల్సిందే.
సోషల్ మీడియాలో మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజ వివాహమై తారా స్థాయిలో చర్చ జరుగుతోంది.ఇక శ్రీజ వివాహంకు చెందిన ఫొటోలు తెగ మీడియాలో సర్కులేట్ అవుతున్నాయి.
ఇదే సందర్బంగా శ్రీజ వివాహం గురించి విమర్శలు తారా స్థాయిలో వస్తున్నాయి.సోషల్ మీడియాలో యాంటీ మెగా ఫ్యాన్స్ శ్రీజ వివాహంపై కామెంట్స్ విసురుతున్నారు.
శ్రీజ లేచిపోయి పెళ్లి చేసుకుని, ఆ తర్వాత విడాకులు తీసుకున్నా కూడా రెండవ పెళ్లి చిరంజీవి ఈ స్థాయిలో చేయడాన్ని కొందరు తప్పు బడుతున్నారు.శ్రీజ చేసిన తప్పును చిరంజీవి సమర్థించినట్లే అవుతుందని, ఆయన చిన్న కూతురుపై ఉన్న అభిమానంతో గతంలో జరిగిన అవమానాన్ని మర్చిపోయినట్లుగా ఉన్నాడు అంటూ మరి కొందరు కామెంట్స్ విసురుతున్నారు.
మరికొందరు రెండవ పెళ్లికి కూడా ఇంత హంగామా అవసరమా అని అంటున్నారు.శ్రీజకు కూతురు కూడా ఉన్న విషయం తెల్సిందే.
ఆ కూతురును పెట్టుకుని శ్రీజ ఇలాంటి వేడుకల్లో పాల్గొంటే ఆ పాప మానసికంగా ఏం ఆలోచిస్తుందో అంటూ మరి కొందరు అంటున్నారు.అయితే మెగా ఫ్యాన్స్ మాత్రం డబ్బులు ఉన్నాయి, ఏమైనా చేసుకుంటారు మీకు ఎందుకు అంటూ యాంటీ ఫ్యాన్స్‌కు కౌంటర్ వేస్తున్నారు.
మరి శ్రీజ వివాహ విషయంపై మీ స్పందన ఏంటి?