అదుపులో పెట్టుకో

తెలుగు ప్రముఖ కమెడియన్‌ అలీ సినిమాల్లోనే కాకుండా ఆయన చేసే బుల్లి తెర కార్యక్రమాలు మరియు స్టేజ్‌ షోల్లో కూడా నవ్వించే ప్రయత్నం చేస్తాడు.ఆ ప్రయత్నంలో నోటి నుండి భూతులు అలా అలా వస్తూనే ఉంటాయి.

 Ali’s Indecent Joke On Samantha-TeluguStop.com

బుల్లి తెరపై ఈయన భూతులు వినలేక చానెల్స్‌ మార్చిన వారు చాలా మంది ఉన్నారు.ఇక ఈయన ఆడియో వేడుకలు మరియు ఇతర ఫంక్షన్స్‌లో వందల, వేల మంది జనాల్లో కూడా ఈయన భూతులు వస్తూనే ఉంటాయి.

తన తోటి యాంకరింగ్‌ చేసే వారిపైనే కాకుండా అక్కడ లేని, ఉన్న వారిపై కూడా అలీ కామెంట్స్‌ చేస్తూనే ఉంటాడు.తాజాగా ఈయన మరోసారి తన నోటి పైత్యంను చూపించాడు.

అల్లు అర్జున్‌ హీరోయిన్‌గా నటించిన ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ ఆడియో సక్సెస్‌ మీట్‌లో అలీ పాల్గొన్నాడు.ఆ సందర్బంగా అక్కడ లేని సమంత గురించి కామెంట్స్‌ చేశాడు.

సమంత హిప్‌ నుండి నడుము భాగం వరకు విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ను పోలి ఉంటుందని, ఆమె అందాలు అదరహో అంటూ మాట్లాడాడు.దాంతో అక్కడున్న అతిథులు సైతం కొంత సమయం మొహం మాడ్చినంత పని చేశారు.

అయితే అలీ ఇలా అనడం మొదటి సారేం కాదు.గతంలో కూడా ఈయన పలువురు హీరోయిన్‌లపై ఇలా సెక్సీ కామెంట్లు చేశాడు.

అందుకే అలీని అంతా కూడా నోరు అదుపులో పెట్టుకోవాలని అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube