Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

రోడ్డు పక్కనే మూత్రవిసర్జన చేసిన బాలివుడ్ హీరోయిన్ -Alia Bhatt Used To Pee In Public During The Shoot Of Highway

సినిమా హీరోయిన్లు అంటే కారవాన్ ఉంటుంది. అందులోనే ఏసీ ఉంటుంది, పడుకోవడానికి బెడ్ ఉంటుంది, లావిష్ గా ఉండే బాత్ రూమ్ ఉంటుంది. ఆ కారవాన్ లో వసతులు మధ్య తరగతి ఇంట్లో కూడా ఉండకపోవచ్చు. కాని ఈ వసతులు ప్రతి చోట దొరకవు. సిటికి దగ్గరలో లేదా, కారవాన్ లో ప్రయాణం చేసేంత దూరంలో మాత్రమే ఇలాంటి విలాసవంతమైన జీవితం ఉంటుంది. హీరోయిన్ అయితే మాత్రం కష్టాలుండవా. ఒకప్పుడు ఇలా కారవాన్ ఉండేది కాదు. అప్పుడు చెట్ల చాటున కాస్ట్యూమ్స్ మార్చుకునేవారు అంట హీరోయిన్లు. అసలు అప్పటికాలం దాక పోవడం ఎందుకు, బాహుబలికి తమన్నా పడిన కష్టాలు అన్ని ఇన్ని కావు. పార్ట్ 1 లో తానూ ఉండే సన్నివేశాలు ఎక్కువగా బల్గేరియాలో షూట్ చేసారు. అంటే మంచు కొండల్లో.

అలాంటి మంచులో స్వెటర్ లేకుండా షూట్ చేయడం చాలా కష్టం. కాని తమన్నా ఒక్కోసారి శరీరాన్ని పూర్తిగా కప్పని బట్టలతో షూట్ చేసింది. నాలుగు చీరలు చుట్టూరా కట్టుకొని కాస్ట్యూమ్స్ మార్చుకునేదట. ఇలా దూరపు ప్రాంతాలలో షూట్ చేస్తే ఇదే ఇబ్బంది. ఇలాంటి ఇబ్బందులు బాలివుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ కూడా చవిచూసిందట. ఆలియా నటించిన “హైవే” ఎక్కువగా మంచు కొండల్లోనే ఉంటుంది. ఆ సినిమా షూట్ చేస్తున్నప్పుడు బాగా చలి వేసేదని, కెమెరా ముందు లేని వారు స్వెటర్లు తొడుక్కుంటే, కెమెరా ముందు లైట్ బట్టలతో నరకం కనిపించేదని చెప్పింది ఆలియా. అంతే కాదు, చలిలో మూత్రం కూడా మాటిమాటికి వస్తుంది కదా, అది కూడా ఓ పెద్ద టార్చర్ లా అనిపించేదట.

చాలాసార్లు రోడ్డు చుట్టుపక్కలే మూత్ర విసర్జన చేసేదాన్ని అని, ఎవరైనా చూసినా వెనుక భాగం మాత్రమే కనిపించేలా జాగ్రత్త పడేదాన్నని, ఆ చలిలో బయటే పడుకోవాల్సి వచ్చేది ఒక్కోసారి, చాలా కష్టపడ్డాను అంటూ తన చలి కష్టాలు ఓ టాక్ షోలో చెప్పుకుంది ఆలియా.

Continue Reading
More Posts
To Top