వారానికి 3 సార్లు మద్యం తాగితే ఈ జబ్బు రాదంట

మోడరేట్ డ్రింకింగ్ వేరు, ఓవర్ డ్రింకింగ్ వేరు.మోడరేట్ డ్రింకింగ్ అంటే ఓ లిమిట్ లో, ఓ పద్దతిగా తాగడం.

 Alcohol Thrice A Week Will Cut Down Diabetes Risk – Study-TeluguStop.com

ఇలా తాగడం చాలా ఆరోగ్యకరమని మేము కొత్తగా చెప్పాల్సిన పని లేదు.ఎందుకంటే మద్యం ఓ లిమిట్ లో తీసుకుంటే ఎంత లాభమో మీరు చాలాసార్లు చదివేశారు.

రోజుకి ఓ డ్రింక్ మందు మంచిదే అని డాక్టర్లు సైతం ఒప్పుకుంటారు.ఇప్పుడు మరో కొత్త లాభంతో ముందుకొచ్చారు National Institute of Public Health at University of Denmark పరిశోధకులు.

వారి పరిశోధనల ప్రకారం వారానికి మూడు నుంచి నాలుగు సార్లు మద్యం ఓ లిమిట్ గా తాగితే ఇటు పురుషులలో, అటు మహిళలలో డయాబెటిక్ వచ్చే అవకాశాలు చాలావరకు తగ్గుతాయట.“మా పరిశోధనల ప్రకారం ఎవరైతే వారానికి మూడు నాలుగు డ్రింక్స్ తో సరిపెట్టుకుంటారో, వారికి షుగర్ వ్యాధి అవకాశం చాలా తక్కువ అని తేలింది.అంటే రాండం డేస్ లో తీసుకోవాలి.అతిగా తాగకూడదు.మా పరిశోధన అదే విషయాన్ని చెబుతోంది” అని అంటున్నారు డెన్మార్క్ పరిశోధకులు.

ఈ పరిశోధనని ప్రోగేసర్ జన్నె తోల్స్త్రప్ మరియు ఆయన శిష్యులు చేపట్టారు.

వారు మద్యానికి బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గడానికి మధ్య ఉన్న సంబంధంపై కొన్నేళ్లుగా పరిశోధన చేస్తున్నారు.ఈ పరిశోధనలో ఏకంగా 70,551 మంది పాల్గొన్నారు.ఇందులోని పార్టిసిపెంట్స్ వైన్, బీర్ తో పాటు కొన్ని హార్డ్ ఆల్కహాల్ డ్రింక్స్ తీసుకున్నారు.వారిని అయితే వారానికి మూడు సార్లు మోడరేట్ డ్రింకింగ్ చేయమన్నారు లేదంటే, పురుషులు రోజుకి రెండు డ్రింక్స్ చొప్పునా, మహిళలు రోజుకి ఒక డ్రింక్ చొప్పున తాగమన్నారు.

ఈ లెక్కన పురుషులు వారానికి 14 డ్రింక్స్, మహిళలు 7 డ్రింక్స్ తీసుకున్నారు.

ఇంతమందిలో కేవలం 859 మంజి పురుషులకి, 887 మహిళలకి మాత్రమె డయాబెటిస్ వచ్చిందట.

మిగితా వారిలో ఆ లక్షణాలు కనిపించలేదు.వారానికి 14 డ్రింక్స్ తీసుకున్నవారిలో 43% డయాబెటిస్ వచ్చే అవకాశాలు తగ్గాయట.

అదే మహిళల విషయానికి వస్తే 32% డయాబెటిస్ వచ్చే ప్రమాదం పడిపోయింది.మరి దీని వెనుక ఉన్న సైన్స్ ఏమిటో మాత్రం చెప్పలేదు ఈ పరిశోధకులు.

కేవలం ఫలితాలు వెళ్ళడిస్తూ ఒక జర్నల్ లో ప్రచూరించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube