ధనుష్‌కు షాక్‌

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమితాబచ్చన్‌ మరియు తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ కలిసి నటించిన ‘షమితాబ్‌’ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ తెరకెక్కి విడుదలైన ఈ సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలం అయ్యింది.

 Negative Talk For Dhanush’s Shamitabh-TeluguStop.com

ఈ సినిమా కోసం చిత్ర యూనిట్‌ సభ్యులు భారీ ఎత్తున ప్రమోషన్‌ చేశారు.అయినా కూడా ఆ ప్రమోషన్‌ ఈ సినిమా సక్సెస్‌కు తోడ్పడలేదు.

హిందీలో ‘రాంజానా’ సినిమా తర్వాత ధనుష్‌ క్రేజ్‌ ఒక్కసారిగా పెరిగింది.ఇక అమితాబచ్చన్‌తో ధనుష్‌ కలిసి నటించడంతో అంచనాలు మరింతగా వచ్చాయి.

ఈ సినిమాతో యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ తనయ అక్షర హాసన్‌ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.ఈ సినిమాపై అక్షర ఎన్నో ఆశలు పెట్టుకుంది.

ధనుష్‌తో ఈమె చేసిన రొమాన్స్‌కు మంచి మార్కులు పడుతాయని, బాలీవుడ్‌లో ఈ అమ్మడు పాగా వేయవచ్చని భావించింది.

ఈ సినిమా తర్వాత ధనుష్‌ వరుసగా బాలీవుడ్‌లో సినిమాలు చేయాలని భావించాడు.

కాని ధనుష్‌ రెండవ సినిమాతో షాక్‌ తిన్నాడు.ఒక వైపు కోలీవుడ్‌లో సూపర్‌ హిట్స్‌తో దూసుకు పోతున్న ధనుష్‌ బాలీవుడ్‌లో ఫ్లాప్‌ పడటంతో నిరాశలో పడ్డాడు.

మరి ధనుష్‌ మరోసారి బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటాడో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube