తండ్రి, అన్నను మించి పోయిన అఖిల్‌!

అక్కినేని ప్రిన్స్‌ అఖిల్‌ తన మొదటి సినిమాతోనే టాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు.ఇక ఈయన తన ఇంట్లో ఉన్న హీరోలు అయిన తండ్రి నాగార్జున మరియు అన్న నాగచైతన్యలకు అందనంత దూరంలో ఉన్నాడు.

 Record Price For Akkineni Akhil’s Movie-TeluguStop.com

ఇప్పటి వరకు నాగార్జున మరియు నాగచైతన్యలు నటించిన ఏ సినిమా కూడా 30 కోట్లు దాటి బిజినెస్‌ చేసింది లేదు.కాని అఖిల్‌ మొదటి సినిమా విడుదలకు ముందే దాదాపుగా 55 కోట్ల నుండి 60 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ చేసినట్లుగా సినీ వర్గాల వారు అంటున్నారు.

నాగార్జున, నాగచైతన్యలు నటించిన ఏ సినిమా ఇప్పటి వరకు 5 కోట్లకు మించిన శాటిలైట్‌ రైట్స్‌ను దక్కించుకున్న దాఖలాలు లేవు.కాని అఖిల్‌ మొదటి సినిమా ఏకంగా 8 కోట్లకు అమ్ముడు పోతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది.

ఇప్పటి వరకు ఏ టాలీవుడ్‌ హీరోకు దక్కని గ్రాండ్‌ ఎంట్రీ అఖిల్‌కు మాత్రమే దక్కుతోంది.దాంతో అక్కినేని ఫ్యాన్స్‌ ఎంతో ఖుషీగా ఉన్నారు.

ఇంత కాలం తమ హీరోలు కోట్లు ఎప్పుడు కొల్లగొడతారా అని ఎదురు చూసిన ఫ్యాన్స్‌కు అఖిల్‌ రూపంలో సమాధానం రాబోతుంది.అక్టోబర్‌ 21న అఖిల్‌ మొదటి సినిమా విడుదలకు అంతా సిద్దం అవుతోంది.

విడుదల తర్వాత అఖిల్‌ మరెన్ని రికార్డులను సొంతం చేసుకుంటాడో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube