అన్నదారిలో అఖిల్‌!

అక్కినేని ఫ్యామిలీ యువరాజు అఖిల్‌ తన మొదటి సినిమాతో దసరాకు సందడి చేసేందుకు సిద్దం అవుతున్నాడు.మొదటి సినిమాను వినాయక్‌ వంటి భారీ మాస్‌ చిత్రాల దర్శకుడితో చేయబోతుండటంతో అఖిల్‌ దృష్టి మాస్‌ ఆడియన్స్‌పై ఉందంటూ చెప్పకనే చెప్పుకొచ్చాడు.

 Akhil Lip Lock With Sayesha-TeluguStop.com

ఇక ఈ మొదటి సినిమాలో యూత్‌ ఆడియన్స్‌ను సైతం ఆకట్టుకునేలా రొమాంటిక్‌ సన్నివేశాల్లో అఖిల్‌ నటిస్తున్నట్లుగా తెలుస్తోంది.చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్న దాని ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్‌ సాహేసా సైగల్‌తో అఖిల్‌ లిప్‌లాక్‌ చేసినట్లుగా తెలుస్తోంది.

అఖిల్‌ అన్న నాగచైతన్య ‘ఏమాయ చేశావే’ సినిమాలో సమంతతో పలు లిప్‌లాక్‌ సీన్స్‌ చేసిన విషయం తెల్సిందే.దాంతో ఆ సినిమా తర్వాత చైతూకు విపరీతమైన యూత్‌ ఫాలోయింగ్‌ వచ్చింది.

అదే దారిలో అఖిల్‌ కూడా నడిచి యూత్‌లో క్రేజ్‌ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.ఇప్పటికే అఖిల్‌ నటించిన ఈ సినిమాకు భారీ క్రేజ్‌ ఉంది.

అన్ని ఏరియాల్లో కూడా రికార్డు స్థాయిలో బిజినెస్‌ చేసి స్టార్‌ హీరోలకు సైతం పోటీగా నిలుస్తోంది.యంగ్‌ హీరోల్లో నెం.1 కోసం పోటీ పడుతున్న వారితో పాటు త్వరలోనే అఖిల్‌ కూడా జాయిన్‌ అవుతాడు అంటూ అక్కినేని ఫ్యాన్స్‌ అంటున్నారు.ఇంకా టైటిల్‌ నిర్ణయించబడని ఈ సినిమా అక్టోబర్‌ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube