భార్య‌తో అఖిలేష్ రాజ‌కీయాలు!

దేశంలో పెద్ద రాష్ట్రం ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో రాజ‌కీయాల వేడి ఇంకా చ‌ల్లార‌లేదు.పార్టీ కోసం తండ్రీ కొడుకులు ములాయం, అఖిలేష్‌ల కుస్తీప‌ట్టు.

 Akhilesh Yadav Using His Wife For Politics-TeluguStop.com

ఇంకా కొన‌సాగుతూనే ఉంది.ప్ర‌స్తుతం పార్టీ ఎస్పీ ఎవ‌ర‌నేది చెప్పాల్సిన విష‌యం ఎన్నిక‌ల సంఘం బ‌రిలో ఉండ‌డంతో ఎవ‌రికి వారు ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.

పార్టీని స్థాపించింది తానే కాబ‌ట్టి గుర్తు స‌హా పార్టీ త‌న‌కే ద‌క్కుతుంద‌ని ములాయం సింగ్ యాద‌వ్‌, దాదాపు 200 మంది ఎమ్మెల్యేలు, 40 మంది ఎంపీల మ‌ద్ద‌తు త‌న‌కే ఉంది కాబ‌ట్టి.పార్టీ ఛీఫ్ తానేన‌ని సీఎం అఖిలేష్‌లు భావిస్తున్నారు.

ఈ క్ర‌మంలో ముంచుకొచ్చిన ఎన్నిక‌ల్లో అనుస‌రించాల్సిన వ్యూహాల‌పై ఎవ‌రికివారు ప‌క్కా ప్ర‌ణాళిక‌ల‌తో ముందుకు సాగుతున్నారు.

ఈ విష‌యంలో రెండాకులు ఎక్కువే చ‌దివాను అన్న‌ట్టు.

అఖిలేష్ అప్పుడే కాంగ్రెస్‌తో బేర‌సారాలు మొద‌లు పెట్టేశారు.కాంగ్రెస్ తోడుగా ఎన్నిక‌ల్లో పాల్గొని విజ‌యం సాధించి తిరిగి సీఎం సీటును కైవ‌సం చేసుకోవాల‌ని అఖిలేష్ భావిస్తుస్తున్నారు.

ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్‌తో మాట్లాడేందుకు అఖిలేష్ అన్నీ సిద్ధం చేసుకున్నారు.అయితే, ఎందుకైనా మంచిద‌ని త‌న భార్య‌, ఎంపీ డింపుల్‌ను రంగంలోకి దింపాడు అఖిలేష్‌.

ఆమె ద్వారా కాంగ్రెస్ అధినేత్రి సోనియా కుమార్తె ప్రియాంకాగాంధీతో రాయ‌బారాలు న‌డుపుతున్నారు.ఎన్నిక‌ల్లో క‌లిసి పోటీ చేద్దామ‌ని, గెలిస్తే.

కొన్ని మంత్రి వ‌ర్గ సీట్లు సైతం కేటాయిస్తాన‌ని అఖిలేష్ చెబుతున్న‌ట్టు తెలుస్తోంది.

వాస్త‌వానికి కాంగ్రెస్‌లో ప్రియాంక ఎలాంటి అధికార హోదాల్లో లేక‌పోయినా.

ఏమో ఎందుకైనా మంచిద‌ని డింపులు మంత‌నాలు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.అంతేకాకుండా.

తండ్రి ములాయం సింగ్ తో పాటు బాబాయి శివపాల్ – పార్టీ స‌ల‌హాదారు అమర్ సింగ్ లను తప్పించి పార్టీని పూర్తిగా తన వశం చేసుకునే ప్రయత్నాల్లో భాగంగా డింపుల్ కు రాజకీయాల్లో పెద్ద పాత్ర అప్పగించాలని అఖిలేశ్ యోచిస్తున్న‌ట్టు తెలుస్తోంది.దీంతోపాటు.

కాంగ్రెస్‌తో పొత్తు కుదిరితే.అటు ప్రియాంకతోపాటు – ఇటు డింపుల్ తోను భారీ ఎత్తున ఎన్నికల్లో ప్రచారం చేయించి గెలుపు గుర్రం ఎక్కాల‌ని అఖిలేష్ భావిస్తున్న‌ట్టు స‌మాచారం.

మ‌రి ఏంజ‌రుగుతుందో చూడాలి.మొత్తానికి త‌న గెలుపుకోసం అఖిలేష్.

భార్య‌ను బాగానే వాడుకుంటున్నాడ‌ని అంటున్నారు విశ్లేష‌కులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube