చరణ్‌ రికార్డుకు ఎసరు పెట్టిన ‘అఖిల్‌’

మెగాస్టార్‌ తనయుడిగా ‘చిరుత’తో ఎంట్రీ ఇచ్చిన రామ్‌చరణ్‌ మొదటి సినిమాతోనే రికార్డులు సృష్టించిన విషయం తెల్సిందే.ఇప్పటి వరకు కూడా రామ్‌చరణ్‌ మొదటి సినిమా కలెక్షన్స్‌ను ఆ తర్వాత వచ్చిన ఏ హీరో మొదటి సినిమా కలెక్షన్స్‌ను కూడా బీట్‌ చేయలేదు.

 Akhil To Break Ram Charan Records-TeluguStop.com

ఆ తర్వాత చరణ్‌ నటించిన పలు సినిమాలు ఎన్నో రికార్డులను బ్రేక్‌ చేశాయి.‘మగధీర’ చిత్రం టాలీవుడ్‌లో నెం.1 స్థానంలో చాలా సంవత్సరాల పాటు ఉంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఇప్పటి వరకు ఉన్న చరణ్‌ రికార్డులను అక్కినేని ప్రిన్స్‌ తన మొదటి సినిమా ‘అఖిల్‌’తో బ్రేక్‌ చేసేలా కనిపిస్తున్నాడు.మొదట అయితే చరణ్‌ ‘చిరుత’ సినిమా మొదటి రోజు కలెక్షన్స్‌ 3.81 కోట్లను ‘అఖిల్‌’ సినిమా బ్రేక్‌ చేయడం ఖాయం అని, ‘చిరుత’కు డబుల్‌ షేర్‌ ఈ సినిమా దక్కించుకోనుంది అంటూ ఫ్యాన్స్‌ చెబుతున్నారు.వినాయక్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఖిల్‌’ సినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.నాగార్జున పుట్టిన రోజు సందర్బంగా నేడు సాయంత్రం ‘అఖిల్‌’ సినిమా ట్రైలర్‌ విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.

విడుదలకు ముందే 50 కోట్ల బిజినెస్‌ను చేసిన ఈ సినిమా విడుదల తర్వాత మరెన్ని రికార్డులను బ్రేక్‌ చేస్తుందో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube