వాము గురించి ఈ రహస్యాలు తెలిస్తే.... వాడటం మానరు

మనం సాధారణంగా వామును వంటలలో వాడుతూ ఉంటాం.వాము మొక్క మొత్తం మంచి సువాసన కలిగి ఉంటుంది.

 Ajwain Best Health Benefits And Uses-TeluguStop.com

వాము మొక్క పువ్వులు గుత్తులు గుత్తులుగా ఉంటాయి.ఈ గుత్తులలోనే వాము గింజలు ఉంటాయి.

వాము జీర్ణశక్తికి మంచిదని మన పెద్దవారు చెప్పటం కూడా మనం తరచుగా వింటూనే ఉంటాం.అలాంటి వాములో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

నీటిలో వామును నానబెట్టి ఆ నీటిలో ఉప్పు కలిపి త్రాగితే వాంతులు తగ్గుతాయి.

అజీర్ణంగా ఉన్నప్పుడు వాము, మిరియాలు, ఉప్పు సమాన భాగాలుగా తీసుకోని పొడి చేసుకొని భోజనానికి ముందు తింటే అజీర్ణం తగ్గుతుంది.

వామును బుగ్గన పెట్టుకుని నమిలి చప్పరిస్తూ రసాన్ని నెమ్మదిగా మింగితే గొంతులో నొప్పి, గొంతులో గురగుర తగ్గుతాయి.

జలుబుకు వాము మంచి మందు.

వాము పొడిని ఒక గుడ్డలో కట్టి మెల్లగా వాసన చూస్తే జలుబు సమస్య నుండి బయట పడవచ్చు.

కీళ్ల నొప్పులు ఉన్నవారు వాము నూనెతో నొప్పి ఉన్న ప్రాంతంలో మర్దన చేసుకుంటే మంచి ఉపశమనం కలుగుతుంది.

దంత సమస్యలు ఉన్నవారు వాము నీటిని నోటిలో పోసుకొని పుక్కిలిస్తే దంత సమస్యలు తగ్గిపోతాయి.

వాము, ధనియాలు, జీలకర్ర ఈ మూడింటిని దోరగా వేగించి కాషాయం చేసుకొని త్రాగితే జ్వరం తగ్గుతుంది

వామును నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడకట్టి త్రాగితే మూత్రాశయంలో రాళ్ళు కరుగుతాయి

తేనెను వాముతో కలిపి తీసుకుంటే కిడ్నీలో రాళ్ళూ కరిగిపోయి మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతాయని ఆయుర్వేదం చెప్పుతుంది

వామును తరచుగా వాడటం వలన గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube