జ‌య వార‌సుడిగా తెలుగు హీరో

త‌మిళ‌నాడు సీఎం, పురుచ్చిత‌లైవి (విప్ల‌వ నాయ‌కురాలు) అందరూ అమ్మ‌గా పిలుచుకునే జ‌య‌ల‌లిత అస్త‌మ‌యం చెందారు.ఇక నిన్న‌టి వ‌ర‌కు జయ‌ల‌లిత చ‌నిపోతే వార‌సుడు ఎవ‌రు…? ఈ ప్ర‌శ్న‌కు ఇద్ద‌రు ముగ్గురు పేర్లు మాత్ర‌మే తెర‌మీద‌కు వ‌చ్చాయి.వారిలో అమ్మ‌కు అత్యంత స‌న్నిహితుడు, మాజీ సీఎంగా ప‌నిచేసిన ప‌న్నీరు సెల్వం పేరు ముందుంది.అమ్మ చ‌నిపోయిన వెంట‌నే గ‌త అర్ధ‌రాత్రే ప‌న్నీరు సెల్వం సీఎంగా ప‌గ్గాలు కూడా చేప‌ట్టేశారు.

 Ajith Is The Successor Of Jayalalithaa..?-TeluguStop.com

ఇక్క‌డి వ‌ర‌కు బాగానే ఉంది.అన్నా డీఎంకేకు భ‌విష్య‌త్తులో తిరుగులేని నాయ‌కుడు ఎవ‌రు అని ప్ర‌శ్నించుకుంటే మాత్రం స‌రైన స‌మాధానం లేదు.

వీరిలో సెల్వ రాజ‌న్‌తో పాటు అమ్మ నెచ్చెలి శ‌శిక‌ళ పేర్లు కూడా వినిపిస్తున్నాయి.అయితే వీరికి ప్ర‌జ‌ల్లో స‌రైన ఆద‌ర‌ణ మాత్రం లేద‌న్న‌ది వాస్త‌వం.

ప్ర‌తిప‌క్షంలో డీఎంకే నుంచి బ‌ల‌మైన క‌రుణానిధి, స్టాలిన్ వంటి బ‌డా నేత‌లు ఉండ‌డంతో వారిని ధీటుగా ఎదుర్కొనే నాయ‌కులు అన్నాడీఎంకేకు అవ‌స‌రం.

ఈ క్ర‌మంలోనే అన్నాడీఎంకే ఫ్యూచ‌ర్‌లో శ‌క్తివంత‌మైన నేత‌గా తెలుగు వాడై, కోలీవుడ్‌లో స్టార్ హీరోగా తిరుగులేని స్టార్‌డ‌మ్ తెచ్చుకున్న త‌ల అజిత్ పేరు తెర‌మీద‌కు వ‌స్తోంది.

ఈ మేర‌కు తాను చ‌నిపోక‌ముందే జ‌య‌ల‌లిత అజిత్ పేరు ప్ర‌తిపాదించిన‌ట్టు ఇప్పుడు అన్నాడీఎంకే వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.అజిత్ అయితే అన్నాడీఎంకేను తిరుగులేని శ‌క్తిగా మార్చుతాడ‌న్న టాక్ త‌మిళ పాలిటిక్స్‌లో వినిపిస్తోంది.

సినిమా క్రేజ్‌తో పాటు యువ‌కుడిగా ఉండ‌డం, ఆవేశం కంటే ఆలోచ‌న మెండుగా ఉంటాడ‌ని పేరుండ‌డం అజిత్‌కు బాగా క‌లిసి రానున్నాయి.

ఇక అజిత్ జ‌య‌ల‌లిత‌ను అమ్మ అని అప్యాయంగా పిలుస్తుండేవారు.

జ‌య నివాస‌మైన పొయెస్‌ గార్డెన్‌కు నేరుగా చేరుకునే అతి కొద్ది మంది వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరు.పార్టీలో ఉన్న‌న్ని రోజులు జ‌య అన్నాడీఎంకేలో నెంబ‌ర్ అనే ప్లేస్ లేకుండా చేశారు.

అన్నీ జ‌యే.ఆమె త‌ర్వాత నెంబ‌ర్ 2 ప్లేస్ అంటూ ఎవ్వ‌రికి లేక‌పోవ‌డంతో ఇప్పుడు అన్నాడీఎంకేలో స‌మ‌ర్థులైన నాయ‌కుల కొర‌త ఉంది.

డీఎంకే నుంచి బ‌ల‌మైన ప్ర‌తిప‌క్ష యువ‌నేత‌గా ఉన్న స్టాలిన్‌ను త‌ట్టుకోవాల‌న్నా, అన్నాడీఎంకే చీలిపోకుండా త‌మిళ‌నాట బ‌లంగా ఉండాల‌న్నా… అజిత్ అయితేనే అన్నాడీఎంకే కార్య‌క‌ర్త‌ల‌తోను, త‌న అభిమానుల‌తోను పార్టీని విజ‌య‌వంతంగా న‌డిపిస్తాడ‌ని చాలా మంది న‌మ్ముతున్నారు.త‌మిళ‌నాట జయలలిత, రజనీకాంత్ తర్వాత ఆ స్థాయిలో ప్రజాదరణ అజిత్ సొంతం.

ఇక జ‌య‌ల‌లిత సైతం త‌న మ‌ర‌ణాంత‌రం ప‌న్నీరు సెల్వంను ముఖ్య‌మంత్రిగా చేయాల‌ని, ఆయ‌న త‌ర్వాత అజిత్‌ను నాయకుడిగా తయారు చేయాలని జ‌య‌ల‌లిత ఇప్ప‌టికే చెప్పిన‌ట్టు అన్నాడీఎంకే వ‌ర్గాల్లో సైతం చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.అదే జ‌రిగితే మ‌న తెలుగువాడు (సికింద్రాబాద్‌లో పుట్టిన) అజిత్ భ‌విష్య‌త్ అన్నాడీఎంకే సార‌ధ్య ప‌గ్గాలు చేప‌ట్టిన‌వాడ‌వుతాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube