కూతుళ్ళ దర్శకత్వంలో రజనీ బయోపిక్

సినిమా టాక్ తో సంబంధం లేకుండా సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా ఓపినింగ్స్ ఎలా ఉంటాయో ‘కబాలి’ చూపించింది.రజనీకాంత్ బాక్స్ ఆఫీస్ వద్ద తన స్టామినా ఏమిటో ‘కబాలి’ వసూళ్లతో చూపించారు.ప్రస్తుతం రజనీకాంత్ శంకర్ దర్శకత్వంలో ‘2.ఓ’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.ఈ సినిమా తర్వాత మరొక సినిమాకి రజనీ కమిట్ అయ్యాడని కోలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి.

 Aishwarya, Soundarya To Direct Father’s Biopic?-TeluguStop.com

ఆ సినిమాని రజనీ ఇద్దరు కూతుళ్లు కలిసి దర్శకత్వం వహిస్తారని సమాచారం.

ప్రస్తుతం రజనీ కూతురు ఐశ్వర్య తన తండ్రికి సంబంధించి ఒక పుస్తకాన్ని రాస్తుందట.ఆ పుస్తకం ఆధారంగా సినిమాని రూపొందిస్తారట.

ఈ మెగా ప్రాజెక్ట్ ఈ సంవత్సరం చివరలో ఉంటుందని కోలీవుడ్ లో అనుకుంటున్నారు.ఇప్పటికే రజనీకాంత్ కూతురు సౌందర్య దర్శకత్వంలో ‘కోచ్చడయాన్‌’ అనే మోషన్‌ క్యాప్చర్‌ సినిమాలో నటించాడు.

ఇప్పుడు ఇద్దరు కూతుళ్లు కలిసి సంయక్తంగా తండ్రిని డైరెక్ట్ చేయటానికి రెడీ అవుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube