జియోకి పోటిగా ఎయిర్ టెల్ కొత్త ఆఫర్స్ ఇవి

టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ మొత్తానికి ఓ మెట్టు దిగనే దిగింది.వచ్చిరావడంతోనే పోటిదారుల మార్కేట్ ని కొల్లగొడుతున్న జియోకి ఎదురొడ్డి నిలబడాలంటే వినియోగదారులని ఆకర్షించే ఆఫర్స్ తప్పవని గ్రహించిన ఎయిర్ టెల్, ఇప్పటికే జరిగిన నష్టాల్ని పూడ్చే పనిలో పడింది.

 Airtel Provides 5gb Night Data-TeluguStop.com

అందుకే కొత్త ఆఫర్లను ప్రవేశపెట్టింది.

* ఎయిర్ టెల్ 5GB డేటా ను కొన్ని షరతులతో అందిస్తోంది.

దీన్ని 4G, 3G, 2G .ఎలా వాడుకోవాలన్నది మీ ఇష్టం.

* మొదటగా ఎయిర్ టెల్ ఆప్ ని మీ స్టోర్ నుంచి డవున్లోడ్ చేసుకోవాలి.

* మీ నంబర్ పై 200 పైచిలుకు రిచార్జ్ ఆప్ ద్వారా చేస్తే వెంటనే 1GB వస్తుంది.

* ఎయిర్ టెల్ అనుబంధిత ఆప్ అయినా వింక్ మ్యూజిక్ ని డౌన్లోడ్ చేసుకోని 10 పాటలు వింటే 500 MB డేటా వస్తుంది.

* వింక్ గేమ్స్ ఆప్ లోంచి ఏదైనా ఒక గేమ్ డౌన్లోడ్ చేసుకుంటే మరో 500 MB మీ అకౌంట్లో జమ అవుతుంది.

* వింక్ మూవీస్ ఆప్ లో ఏదైనా సినిమా చూస్తే మరో 500 MB డేటా దక్కించుకోవచ్చు.

* వింక్ మ్యూజిక్ నుంచి ఒక మ్యూజిక్ ఆల్బమ్ డౌన్లోడ్ చేస్తే 200 MB డేటా వస్తుంది.

* ఎయిర్ టెల్ సెండ్ మని నుంచి కనీసం 100 రూపాయలు పంపిస్తే 500 MB డేటా వస్తుంది.

* వింక్ గేమ్స్ ఆప్ నుంచి మూడు గేమ్స్ డౌన్లోడ్ చేస్తే 200 MB రిచార్చ్ అవుతుంది.

* వింక్ మూవీస్ ఆప్ లో, ఏరోస్ నౌ ఛానెల్ లో ఏదైనా సినిమా చూస్తే 200 MB డేటా లభిస్తుంది.

* ఎయిర్ టెల్ ఆప్ నుంచి మీ స్నేహితుడికి రిఛార్జ్ చేస్తే మరో 500 MB మీ సొంతం అవుతుంది.

నోట్ : ఈ డేటా రాత్రి 12:00 గంటల నుంచి ఉదయం 6:00 గంటల లోపే వాడుకోవచ్చు.ఆఫర్స్ అన్ని సెప్టెంబరు వరకే వర్తిస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube