జియోకి చెక్ పెట్టేందుకు నోకియాతో చేతులు కలిపిన ఎయిర్ టెల్ .. సంచలనమైన ప్రకటన

మొబైల్ దిగ్గజం నోకియా స్మార్ట్ ఫోన్ బిజినెస్‌ లో అల్రెడి సంచలనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.త్వరలోనే నోకియా స్మార్ట్ ఫోన్స్ ఇండియాలో దర్శనమివ్వనున్నాయి.

 Airtel And Bsnl To Join With Nokia For 5g In India-TeluguStop.com

ఇదిలా ఉంటే జియో దెబ్బకు విలవిలలాడుతున్న ఎయిర్ టెల్, బిఎస్ఎన్ఎల్ నోకియాతో చేతులు కలుపుతున్నాయి.ఓ పెద్ద ఒప్పందం కుదుర్చుకోని, చాలా పెద్ద ప్లాన్ వేస్తున్నాయి.మీ ఊహకందని స్కెచ్ అది.

4G నెట్వర్క్ రంగంలో జియో అల్లాడిస్తోంది.జియోకి సమానంగా ఇలా ఆఫర్ ప్రకటించగానే అలా సమ్మర్ సర్ ప్రైజ్ అంటూ మళ్ళీ జనాల్ని తనవైపు తిప్పుకుంది జియో.మరో నాలుగు నెలల వరకు జియో తప్ప మరో 4G నెట్వర్క్ వాడేలా లేరు జనాలు.

సరే నాలుగు నెలలు గడిచిన తరువాతైనా ఏదైనా కొత్త ప్లాన్ తీసుకొద్దామంటే, మళ్ళీ ఆ సమయానికి జియో మరో కొత్త షాక్ ఇస్తే ? అందుకే జియోని మించి సర్వీసులు, జియో మొదలుపెట్టని సర్వీసులు ఇవ్వాలనుకుంటున్నాయి ఈ రెండు కంపెనీలు.అందుకోసమే 5G ప్లాన్స్ మొదలుపెట్టాయి.

నోకియా, ఎయిర్ టెల్, బిఎస్ఎన్ఎల్ కలిసి భారతదేశంలో 5G తీసుకురానున్నాయి.అదీకూడా చైనాతో పోటిపడుతూ అతి త్వరలోనే తీసుకొచ్చే ప్రయత్నలు చేస్తున్నాయి.ఈ విషయం మీద ఇప్పటికే మెమొరెండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ మీద ఈ కంపెనీలు సంతకం చేసినట్లు సమాచారం.

2019-2020 మధ్యలో 5G పనులు మొదలవుతాయట.LTE రంగంలో జియో హవా కొనసాగుతే ఏంటి .loT మాత్రం తామే తీసుకొస్తాం .5G తో మాదే రాజ్యం అని ఎయిర్ టెల్, బిఎస్ఎన్ఎల్ తొడకొడుతోంటే … జియో ఊరికే ఉంటుందా ? పోటిగా జియో సామ్ సంగ్ తో చేతులు కలుపనుందని టాక్.మొత్తానికి ఇప్పుడు 4G సర్వీసులు మేం తక్కువకి ఇస్తామంటే మేం తక్కువకి ఇస్తాం అంటూ కంపెనీలు ఎలాగైతే దెబ్బలాడుకుంటున్నాయో .మరో రెండుమూడు ఏళ్ళలో 5G అందిస్తూ అలానే పోటిపడతాయన్నమాట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube