Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

  • WhatsApp

జియోకి చెక్ పెట్టేందుకు నోకియాతో చేతులు కలిపిన ఎయిర్ టెల్ .. సంచలనమైన ప్రకటన-Airtel And BSNL To Join With Nokia For 5G In India

మొబైల్ దిగ్గజం నోకియా స్మార్ట్ ఫోన్ బిజినెస్‌ లో అల్రెడి సంచలనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే నోకియా స్మార్ట్ ఫోన్స్ ఇండియాలో దర్శనమివ్వనున్నాయి. ఇదిలా ఉంటే జియో దెబ్బకు విలవిలలాడుతున్న ఎయిర్ టెల్, బిఎస్ఎన్ఎల్ నోకియాతో చేతులు కలుపుతున్నాయి. ఓ పెద్ద ఒప్పందం కుదుర్చుకోని, చాలా పెద్ద ప్లాన్ వేస్తున్నాయి. మీ ఊహకందని స్కెచ్ అది.

4G నెట్వర్క్ రంగంలో జియో అల్లాడిస్తోంది. జియోకి సమానంగా ఇలా ఆఫర్ ప్రకటించగానే అలా సమ్మర్ సర్ ప్రైజ్ అంటూ మళ్ళీ జనాల్ని తనవైపు తిప్పుకుంది జియో. మరో నాలుగు నెలల వరకు జియో తప్ప మరో 4G నెట్వర్క్ వాడేలా లేరు జనాలు. సరే నాలుగు నెలలు గడిచిన తరువాతైనా ఏదైనా కొత్త ప్లాన్ తీసుకొద్దామంటే, మళ్ళీ ఆ సమయానికి జియో మరో కొత్త షాక్ ఇస్తే ? అందుకే జియోని మించి సర్వీసులు, జియో మొదలుపెట్టని సర్వీసులు ఇవ్వాలనుకుంటున్నాయి ఈ రెండు కంపెనీలు. అందుకోసమే 5G ప్లాన్స్ మొదలుపెట్టాయి.

Continue Reading
More Posts
To Top