ప‌వ‌న్‌పై జ‌గ‌న్ ఆధిప‌త్యం కొన‌సాగేనా?

ఆకులు కాలాక చేతులు ప‌ట్టుకుని ఏం లాభం.ఈ విష‌యం ఇప్పుడు జ‌నసేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు స‌రిగ్గా స‌రిపోతుంది.

 Agri Gold Issue Leaves Pawan Kalyan Behind-TeluguStop.com

కొన్ని రోజులుగా అగ్రిగోల్డ్ వ్య‌వ‌హారం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది.అసెంబ్లీలో ఈ అంశంపై వాడివేడి చ‌ర్చ జ‌రిగింది.

ఈ స‌మ‌యంలో ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌.చాలా దూకుడుగా వ్య‌వ‌హ‌రించారు.

అటు అసెంబ్లీలోనూ, ఇటు బ‌య‌ట త‌న పూర్తి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు.ఉద్దానం కిడ్నీ స‌మ‌స్య‌, రాజ‌ధానికి భూములిచ్చిన రైతుల స‌మ‌స్య‌.

ఇలా అన్నింటిలోనూ ప్ర‌తిప‌క్ష నేత కంటే జ‌న‌సేనాని ముందున్నాడు, కానీ ఇప్పుడు ఆయ‌న కంటే జ‌గ‌న్ మ‌రింత దూకుడుగా ఉన్నారు.ఈ విష‌యంలో జ‌గ‌న్ ముందు ప‌వ‌న్ తేలిపోతున్నాడ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

అగ్రిగోల్డ్ వ్యవహారం.ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ దుమారానికి కారణమవుతోంది.

జనం నుంచి డిపాజిట్లు తీసుకుని.తర్వాత లెక్కలేనన్ని ఆస్తులు కొని.

చివరికి జనానికి అగ్రిగోల్డ్ సంస్థ హ్యాండ్ ఇచ్చింది.ఈ వ్యవహారంలో.

మంత్రి పత్తిపాటి పుల్లారావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.ఈ విషయంలో ప్రతిపక్ష నేత జగన్ ఇప్పటికే దూకుడు పెంచగా.

ఇప్పుడు.టీడీపీ ఆప్త మిత్రుడు.

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా.ఈ వ్యవహారంపై ప్రశ్నించడానికి రెడీ అయ్యారు.

అగ్రిగోల్డ్ బాధితులు చేస్తున్న ఆందోళనకు సంఘీ భావం తెలిపేందుకు నిర్ణయించారు.మార్చి 30న విజయవాడ వెళ్లి.

వారితో ఆందోళనలో పాల్గొని తన భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తారట.

అయితే అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో పవన్ కంటే.

ప్రతిపక్ష నేత జగన్ చిత్తశుద్ధే బాగుందని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.ఇప్పటికే అగ్రిగోల్డ్ బాధితులకు సంఘీభావం ప్రకటించిన జగన్.

వారి పక్షాన గొంతు వినిపించారు.తన ప్రభుత్వం వచ్చాక బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు.

ఇలా.జగన్ అడ్వాన్స్ గా, వేగంగా స్పందించారు.కానీ.పవన్ కల్యాణ్ మాత్రం.చాలా నింపాదిగా.చాలా ఆలస్యంగా అగ్రిగోల్డ్ బాధితుల కోసం అడుగులు వేస్తున్నారు.

ఇదే.జగన్ తో రేస్ లో పవన్ చాలా వెనకబడి పోయాడన్న విషయాన్ని స్పష్టం చేస్తోందన్నారు.

దీంతో.కొందరు రాజకీయ విశ్లేషకులు కొత్త అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.గతంలో ఉద్ధానం కిడ్నీ బాధితుల విషయంలో పవన్ అడ్వాన్స్ గా స్పందించినా.ఇప్పుడు మాత్రం ప్రశ్నించేందుకు ఆలస్యం చేస్తుండడాన్ని అనుమానిస్తున్నారు.

అప్పుడు పవన్ తర్వాత.జగన్ స్పందిస్తే.ఇప్పుడు జగన్ తర్వాత పవన్ పోరాటానికి రెడీ అవడాన్ని ప్రస్తావిస్తున్నారు.అలాగే… జగన్ దూకుడుతో అలర్ట్ అయిన టీడీపీ.పవన్ ను ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోందని కూడా అనుమానిస్తున్నారు.మ‌రి ఈ దూకుడుని జ‌గ‌న్ కొన‌సాగిస్తాడో లేదో వేచిచూడాల్సిందే!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube