మళ్లీ కరెంటు 'కోత'లు తప్పవా!!

రాష్ట్ర విభజన తరువాత తెలంగాణా అంధకారం అయిపోయింది…కరెంటు లేని రాష్ట్రంగా అనేకానేక విమర్శలు ఎదుర్కుంది.అయితే ప్రభుత్వం అలెర్ట్ అయ్యి ఏదో విధంగా కొంతలో కొంత కరెంటు కోతలు తగ్గించి సకాలంలో కరెంటును అందిస్తుంది.

 Again Current Crisis In Telangana-TeluguStop.com

ఇదిలా ఉంటే తాజాగా వినిపిస్తున్న వాదన ప్రకారం తెలంగాణా రాష్ట్రంలో మళ్లీ కరెంటు సమస్యలు ఏర్పడనున్నాయి అని తెలుస్తుంది.సంగతి ఏంటంటే…రబీ సీజన్ లో వ్యవసాయానికి పూర్తి స్థాయిలో విద్యుత్ ఇవ్వడం కష్టమేనని ప్రభుత్వం దీనిపై ఆలోచనలో పడినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

అయితే ఈ వార్తలు నేపధ్యంలో అలెర్ట్ అయిన టీ-సర్కార్ ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం మరో వెయ్యి మెగావాట్ల విద్యుత్ అందించేందుకు సిద్ధంగా ఉందని తదనుగుణంగా చర్యలు చేపట్టాలని అదికారులను ఆదేశించింది.ఇక ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ అందుబాటులో ఉన్నది 4300 మెగావాట్లు కాగా,డిమాండ్ ఆరు వేల మెగావాట్లని అంచనావేశారు.

వీలైన చోట్ల కొనుగోలు చేయాలని కూడా ముఖ్యమంత్రి అధికారులను కోరారు.మరో పక్క ఇప్పటికే ప్రధాని మోడీకి విద్యుత్ ఇచ్చి ఆదుకోవాలని కూడా కేసీఆర్ కేంద్రాన్ని వేడుకున్నారు.

ఏది ఏమైనా ప్రభుత్వం ఎన్ని ఆలోచనలు చేసినా మళ్లీ టీ ప్రజలకు కరెంటు వాతలు తప్పేలా లేవు అన్నది మాత్రం జగమెరిగిన సత్యం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube