పెద్ద‌త‌ప్పు చేయ‌బోతోన్న అఖిల్‌

అక్కినేని నటవారసుడిగా అఖిల్ సినిమాతో గ్రాండ్‌గా వెండితెర‌కు ప‌రిచ‌యం అయ్యాడు అక్కినేని అఖిల్‌.యంగ్‌హీరో నితిన్ నిర్మాత‌గా స్టార్ డైరెక్ట‌ర్ వివి.

 Again Akhil Doing Same Mistake-TeluguStop.com

వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన అఖిల్ సినిమా ఘోర‌మైన డిజాస్ట‌ర్‌గా మిగిలి అఖిల్ జీవితంలో మ‌ర్చిపోలేని షాక్ ఇచ్చింది.ఈ సినిమా త‌ర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్న అఖిల్ ఇప్పుడు త‌న రెండో సినిమాలో న‌టిస్తున్నాడు

తొలి సినిమాతో అఖిల్ ల‌వ‌ర్‌బాయ్ ఇమేజ్ కోసం ట్రై చేయ‌కుండా ఓ యాక్ష‌న్ సినిమా స్టోరీని ఎంచుకుని బిగ్ మిస్టేక్ చేశాడ‌న్న విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి.

అఖిల్ తండ్రి నాగార్జున‌కు ఇప్ప‌ట‌కీ మ‌న్మ‌థుడు ఇమేజ్ చెక్కు చెద‌ర్లేదు.కానీ అఖిల్ తొలి సినిమాతోనే అలాంటి ఇమేజ్ కాకుండా మాస్ ఇమేజ్ కోరుకోవాల‌ని ట్రై చేయ‌డం, అది దారుణంగా బెడిసి కొట్ట‌డంతో అక్కినేని ఫ్యామిలీతో పాటు అభిమానులు షాక్ అయ్యారు.

అయితే ఇప్పుడు అఖిల్ రెండో సినిమా విష‌యంలోనే అదే త‌ప్పు చేస్తున్నాడా ? అంటే ఇండ‌స్ట్రీలో అవున‌నే ఆన్స‌ర్ వ‌స్తోంది.మనం ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ తన రెండో సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.

ఈ సినిమా కోసం అఖిల్ భారీ యాక్ష‌న్ సీన్స్ చేస్తున్నాడు.ఇందుకోసం ఏకంగా హాలీవుడ్ స్టంట్ మాస్ట‌ర్ల‌ను రప్పించార‌ట‌.

ఈ సినిమాతో అయినా అఖిల్, తండ్రి బాటలో మన్మథుడి ఇమేజ్ కంటిన్యూ చేస్తాడనుకుంటే మరోసారి మాస్ ఇమేజ్ కోసం ట్రై చేస్తుండ‌డం రిస్కే అన్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.మ‌రి ఈ సారి అయినా అఖిల్ స‌క్సెస్ అందుకుంటాడేమో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube