మెగా ఫోన్ పడుతున్న మరో రైటర్..!

పరిశ్రమలో ఒకటవుదాం అనుకుని వచ్చి మరొకలా సెట్ అయిన వారు చాలామందినే చూస్తుంటాం.ఇక దర్శకులు ఆర్టిస్ట్ లుగా.

 Again A Writer Turn As Director-TeluguStop.com

ఆర్టిస్ట్ లు దర్శకులుగా కూడా మారుతుంటారు.అయితే చాలామంది దర్శకులుంటారు కాని రచయితలుగా ఉంటూ దర్శకులుగా మారిన వారు తక్కువ మంది ఉంటారు.

అలాంటి వారికి సూపర్ సక్సెస్ తో దూసుకుపోతున్న కొరటాల శివ స్పూర్తిగా నిలిచాడు.

అందుకే ఇప్పుడు మరో రైటర్ స్టార్ కెమెరా యాక్షన్ అనేందుకు సిద్ధమయ్యాడు.

ఇంతకీ మెగా ఫోన్ పట్టబోతున్న రచయిత ఎవరంటే వెలిగొండ శ్రీనివాస్.డమరుకం, అఖిల్, జబర్దస్త్ సినిమాలతో రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వెలిగొండ శ్రీనివాస్ లాస్ట్ ఇయర్ రామ్ కు పండుగ చేస్కో సినిమాకు కథ అందించాడు.

ఇక తనకు దర్శకత్వం చేసే అనుభవం వచ్చిందంటూ డైరక్షన్ చేస్తున్నాడు వెలిగొండ శ్రీనివాస్.

ఇప్పటికే రాజ్ తరుణ్ తో కథా చర్చలు కూడా ముగించేశారట.

ఈ సినిమాను అనీల్ సుంకర నిర్మిస్తున్నారు.ఈడోరకం ఆడోరకం హిట్ తో మంచి జోష్ లో ఉన్న రాజ్ తరుణ్ తో ఏకంగా మూడు సినిమాలకు ఒకేసారి అగ్రిమెంట్ చేయించుకున్నాడు అనీల్ సుంకర.

మరి రచయితగా తన పెన్ పవర్ చూపించిన వెలిగొండ శ్రీనివాస్ దర్శకుడిగా మెప్పిస్తాడా లేడా అన్నది సినిమా వస్తేనే గాని చెప్పలేం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube