ఐడియా తీసుకొచ్చింది అన్ లిమిటెడ్ 3G/4G ఆఫర్

జియో ప్రభావంతో ఇంటర్నెట్ చాలా చవకగా మారిపోయింది.ఒక జీబీ డేటా కోసం కూడా వందల రూపాయలు ఖర్చు చేసే రోజులు ఎప్పుడో పోయాయి.

 After Vodafone, Idea Comes Up With Cheap 3g/4g Unlimited Offer-TeluguStop.com

దాంతో జియో కాకుండా, భారతదేశంలోని ఇతర మొబైల్ నెట్వర్క్ కంపెనీలన్నీ నష్టాలు కల్లజూస్తున్నాయి.జియో లాగా అన్ని ఉచితంగా ఇచ్చే స్థోమత లేక, జనాల్ని ఏదోవిధంగా తమ కంపెని ఇంటర్నెట్ వాడేలా ప్రోత్సహించడానికి ఒకదాని తరువాత మరొకటి పోటిపడి ఆఫర్లు అందిస్తున్నాయి.

ఈమధ్యే 16 రూపాయలకే గంటసేపు లిమిట్ లేని 4G/3G వాడుకునే ఆఫర్ తో వోడాఫోన్ ఒక్క కొత్త ట్రెండ్ సృష్టించిన సంగతి తెలిసిందే.ఈ ప్లాన్ సక్సెస్ కావడంతో ఇప్పుడు అదే బాటలో పయనిస్తూ, ఐడియా కూడా అలాంటి ఆఫర్ ఒకటి అందిస్తోంది.

14 రూపాయలు చెల్లిస్తే చాలు, గంటసేపు అన్లిమిటెడ్ 3G డేటా మీ సొంతం.అదే 22 రూపాయలు చెల్లిస్తే, గంటసేపు 4G/3G ఎంతైనా వాడుకోవచ్చు.

అన్ లిమిటెడ్ అన్నమాట.ఇదే పద్ధతిలో ఎయిర్ టెల్ కూడా ఓ మంచి ఆఫర్ ని ప్రకటించే అవకాశాలు ఉన్నాయని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube