‘ఆంధ్రావాలా’ తర్వాతే ‘బాహుబలి’

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ ‘ఆంధ్రావాలా’ ఎంతటి డిజాస్టర్‌ అయినా కూడా ఆ సినిమాకు ఎప్పటికి చెరిగి పోని రికార్డు ఉంది.అదే ఆడియో విడుదల కార్యక్రమం.

 After Andhrawala Movie Baahaubali Creates Record-TeluguStop.com

పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆంధ్రావాలా’ సినిమా ఆడియో వేడుక ఎన్టీఆర్‌ స్వస్థలం అయిన నిమ్మకూరులో జరిపించారు.‘ఆంధ్రావాలా’ సినిమాకు ముందు ఎన్టీఆర్‌ ‘సింహాద్రి’ సూపర్‌ డూపర్‌ హిట్‌ అవ్వడంతో పాటు పూరి కూడా మంచి మంచి సక్సెస్‌లు దక్కించుకుని ఉన్నాడు.

దాంతో ‘ఆంధ్రావాలా’ ఆడియోకు అనూహ్య స్పందన వచ్చింది.నిమ్మకూరుకు అన్ని తెలుగు జిల్లాల నుండి ప్రత్యేక రైల్లు వేయించడంతో అభిమానులు దాదాపుగా 5 నుండి 6 లక్షల మంది వచ్చారు అంటూ ప్రచారం జరిగింది.

తాజాగా ‘బాహుబలి’ ఆడియో వేడుకకు రెండు లక్షల మంది అభిమానులు హాజరు అయ్యారు అని విశ్లేషకులు చెబుతున్నారు.అంటే ‘ఆంధ్రావాలా’ ఆడియన్స్‌తో పోల్చితే ‘బాహుబలి’ ఆడియన్స్‌ తక్కువే అని చెప్పాలి.

అయితే ప్రస్తుత పరిస్థితులు వేరు.అప్పటి పరిస్థితులు వేరు.

ఈ పరిస్థితుల్లో రెండు లక్షల మంది రావడం అంటే మామూలు విషయం కాదు.ఇంత భారీ స్థాయిలో మరే సినిమా వేడుకకు ఇప్పట్లో వచ్చే అవకాశాలు లేవని అంటున్నారు.

‘బాహుబలి’ రికార్డు చెరిగి పోవడం ఇప్పట్లో అయ్యే పని కాదు.ఇక ‘ఆంధ్రావాలా’ రికార్డు దగ్గరకు కూడా ఏ ఆడియో ఫంక్షన్‌ వెళ్లలేదు అని చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube