వాజ్‌పేయ్‌పై అద్వానీ కుట్ర గుట్టు ర‌ట్టు

భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ)కి పునాదులు వేసిన నాయ‌కులెవ‌రంటే వెంట‌నే గుర్తొచ్చే పేర్లు మాజీ ప్ర‌ధాని వాజ్‌పేయ్‌, ఎల్‌కే అద్వానీ.ఒక‌రు త‌న ర‌థ‌యాత్ర ద్వారా పార్టీని సంస్థాగ‌తంగా బ‌లోపేతం చేసి అధికారంలోకి తీసుకువ‌స్తే.

 Advani Master Plan On Vajpayee-TeluguStop.com

మ‌రొక‌రు త‌న పాల‌న ద‌క్ష‌త‌తో దేశ ప్ర‌తిష్ఠ‌ను ఇనుమ‌డింప‌జేశారు.అయితే కృష్ణార్జునుల్లా ఉండే వీరి మ‌ధ్య అంత‌ర్గ‌తంగా విభేదాలు ఉన్నాయా? ప్ర‌ధానిగా ఉన్న వాజ్‌పేయ్‌ను గ‌ద్దె దింపేందుకు అద్వానీ విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేశారా? అంటే అవున‌నే అంటున్నారు సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ఎన్ పీ ఉల్లేఖ్‌!! ఆయ‌న రాసిన `ది అన్‌టోల్డ్ వాజ్‌పేయ్‌: పొలిటియ‌న్ అండ్ పార‌డాక్స్‌` అనే పుస్త‌కంలో ఈ సంచ‌ల‌న విష‌యాల‌ను వెల్ల‌డించారు.

ఇటీవ‌ల కొంత‌మంది రాస్తున్న పుస్తకాలు సంచ‌ల‌నాల‌కు వేదిక‌గా మారుతున్నాయి.వాటిలో ఇప్పుడు ఉల్లేఖ్ పుస్త‌కం కూడా చేరింది.దీని ప్ర‌కారం.వాజ్ పేయ్‌ ప్రధానిగా బాధ్య‌త‌లు స్వీకరించిన కొద్దిరోజులకే ఆయన్ను గద్దె దింపి.

అద్వానీని ప్రధానిగా చేసేందుకు కుట్ర జరిగిందట.స‌న్నిహిత వ‌ర్గాల ద్వారా ఈ విష‌యం తెలుసుకున్న వాజ్‌పేయి.

త‌న‌కు స‌న్నిహితంగా ఉండే ఒక మంత్రితో దీని గురించి ప్ర‌స్తావించార‌ట‌.కుట్ర గురించి త‌న‌కూ స‌మాచారం అందింద‌ని, అద్వానీ కేంద్రంగా ఇది జ‌రుగుతోంద‌న్న అవ‌గాహ‌న ఉంద‌ని ఆ మంత్రి చెప్ప‌డంతో.

వాజ్‌పేయ్ ఒక్క‌సారిగా దిగ్భ్రాంతికి గురయ్యార‌ట‌.తదనంతర పరిణామాలు తెలుసుకునేందుకు ప్రయత్నించారట.

బీజేపీకి మార్గదర్శకత్వం వహించే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో వాజ్ పేయ్‌ని రాష్ట్రపతిని చేసి అద్వానీని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టాలనే ప్రయత్నం జరగటాన్ని ప్రస్తావించారు.ఈ క్రమంలో అద్వానీ కేంద్రంగా వాజ్‌పేయ్‌ని దింపే కుట్ర జరిగి ఉంటుందని విశ్లేషించారు.

ఈ విషయాలకు మద్దతుగా ఉన్న అంశాలనూ ఆయ‌న ప్ర‌స్తావించారు.ఇదిలా ఉండ‌గా.

ప్ర‌ధానిగా మోదీ ఎంపిక‌ను కూడా అద్వానీ తొలినుంచి వ్య‌తిరేకిస్తున్న విష‌యం తెలిసిందే!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube