Connect with us

మీ మిత్రులకు షేర్ చేయగలరు.

Featured

వాజ్‌పేయ్‌పై అద్వానీ కుట్ర గుట్టు ర‌ట్టు-Advani Master Plan On Vajpayee

భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ)కి పునాదులు వేసిన నాయ‌కులెవ‌రంటే వెంట‌నే గుర్తొచ్చే పేర్లు మాజీ ప్ర‌ధాని వాజ్‌పేయ్‌, ఎల్‌కే అద్వానీ. ఒక‌రు త‌న ర‌థ‌యాత్ర ద్వారా పార్టీని సంస్థాగ‌తంగా బ‌లోపేతం చేసి అధికారంలోకి తీసుకువ‌స్తే.. మ‌రొక‌రు త‌న పాల‌న ద‌క్ష‌త‌తో దేశ ప్ర‌తిష్ఠ‌ను ఇనుమ‌డింప‌జేశారు. అయితే కృష్ణార్జునుల్లా ఉండే వీరి మ‌ధ్య అంత‌ర్గ‌తంగా విభేదాలు ఉన్నాయా? ప్ర‌ధానిగా ఉన్న వాజ్‌పేయ్‌ను గ‌ద్దె దింపేందుకు అద్వానీ విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేశారా? అంటే అవున‌నే అంటున్నారు సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ఎన్ పీ ఉల్లేఖ్‌!! ఆయ‌న రాసిన `ది అన్‌టోల్డ్ వాజ్‌పేయ్‌: పొలిటియ‌న్ అండ్ పార‌డాక్స్‌` అనే పుస్త‌కంలో ఈ సంచ‌ల‌న విష‌యాల‌ను వెల్ల‌డించారు.

ఇటీవ‌ల కొంత‌మంది రాస్తున్న పుస్తకాలు సంచ‌ల‌నాల‌కు వేదిక‌గా మారుతున్నాయి. వాటిలో ఇప్పుడు ఉల్లేఖ్ పుస్త‌కం కూడా చేరింది. దీని ప్ర‌కారం.. వాజ్ పేయ్‌ ప్రధానిగా బాధ్య‌త‌లు స్వీకరించిన కొద్దిరోజులకే ఆయన్ను గద్దె దింపి.. అద్వానీని ప్రధానిగా చేసేందుకు కుట్ర జరిగిందట. స‌న్నిహిత వ‌ర్గాల ద్వారా ఈ విష‌యం తెలుసుకున్న వాజ్‌పేయి.. త‌న‌కు స‌న్నిహితంగా ఉండే ఒక మంత్రితో దీని గురించి ప్ర‌స్తావించార‌ట‌. కుట్ర గురించి త‌న‌కూ స‌మాచారం అందింద‌ని, అద్వానీ కేంద్రంగా ఇది జ‌రుగుతోంద‌న్న అవ‌గాహ‌న ఉంద‌ని ఆ మంత్రి చెప్ప‌డంతో.. వాజ్‌పేయ్ ఒక్క‌సారిగా దిగ్భ్రాంతికి గురయ్యార‌ట‌. తదనంతర పరిణామాలు తెలుసుకునేందుకు ప్రయత్నించారట.

బీజేపీకి మార్గదర్శకత్వం వహించే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో వాజ్ పేయ్‌ని రాష్ట్రపతిని చేసి అద్వానీని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టాలనే ప్రయత్నం జరగటాన్ని ప్రస్తావించారు. ఈ క్రమంలో అద్వానీ కేంద్రంగా వాజ్‌పేయ్‌ని దింపే కుట్ర జరిగి ఉంటుందని విశ్లేషించారు. ఈ విషయాలకు మద్దతుగా ఉన్న అంశాలనూ ఆయ‌న ప్ర‌స్తావించారు. ఇదిలా ఉండ‌గా.. ప్ర‌ధానిగా మోదీ ఎంపిక‌ను కూడా అద్వానీ తొలినుంచి వ్య‌తిరేకిస్తున్న విష‌యం తెలిసిందే!

Continue Reading

More in Telugu News

 • HEALTH TIPS

  Infections that can spread while kissing

  By

  ముద్దు పెట్టుకోవడం మంచిపనే. సంభోగానికి ముందు ప్రేరేపణకి పనికివస్తుంది. సెరోటోనిన్, ఆక్సిటోసిన్, డోపామైన్ లాంటి హార్మోన్లు విడుదల చేసి శరీరానికి, మనసుకి,...

 • NEWS

  Reason Behind Hari Krishna Sudden Entry

  By

  ఎమ్మెల్సీ ఎన్నిక‌ల వేళ‌.. ఏపీ రాజ‌కీయాల్లో ఊహించ‌ని ప‌రిణామాలు జ‌రుగుతున్నాయి! తెలుగుదేశం పొలిట్ బ్యూరో స‌మావేశంలో ఎన్టీఆర్ త‌న‌యుడు హ‌రికృష్ణ పాల్గొన‌డంతో...

 • NEWS

  Janasena Party MLA Seats List

  By

  ఏపీలో ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన పార్టీ సాధించే సీట్ల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు చ‌ర్చ జ‌రుగుతూనే ఉంది. వాస్త‌వానికి...

 • NEWS

  Actress Kavitha Wants TDP MLC Seat

  By

  తెలుగు సినీ న‌టి.. టీడీపీ మ‌హిళా నేత క‌విత కూడా ఎమ్మెల్సీ రేసులో ముందున్న‌ట్టు తెలుస్తోంది. టీడీపీ ఆవిర్భావం నుంచి తాను...

To Top
Loading..