6 కేజీలు చిక్కిన ముద్దుగుమ్మ

తమన్నా ప్రస్తుతం టాలీవుడ్‌ ఆశలన్నీ ‘బాహుబలి’పైనే పెట్టుకుంది.ఈమె నటించి ఇటీవలే విడుదలైన ‘ఆగడు’ చిత్రం భారీ ఫ్లాప్‌ను మిగిల్చింది.

 Tamanna Reduces 6 Kgs For Baahubali-TeluguStop.com

దాంతో ఈ అమ్మడు తన తర్వాతి సినిమా అయిన ‘బాహుబలి’పైనే ఆశలు పెట్టుకుంది.ఈ చిత్రం కోసం తమన్నా చాలా కష్టపడిరదట.

దాదాపు ఆరు కేజీల బరువు తగ్గి మరింత అందంగా కనిపించేందుకు యోగాలు, కఠోర డైట్‌లు ఫాలో అయినట్లుగా తెలుస్తోంది.ఈ సినిమా కోసం కత్తి యుద్దాలు మరియు గుర్రపు స్వారీలు కూడా తమన్నా నేర్చుకున్నట్లుగా తెలుస్తోంది.

తమన్నా పడ్డ కష్టం తాజాగా విడుదలైన ‘బాహుబలి’లోని అవంతిక ఫస్ట్‌లుక్‌లో తెలుస్తోంది.ఆ ఫస్ట్‌లుక్‌లో తమన్నా దేవ కన్యగా ప్రేక్షకుల మనస్సులను దోచుకునేలా ఉంది.

రాజమౌళి దర్శకత్వ ప్రతిభతోపాటు తమన్నా అందాలు అవంతిక పాత్రకు మరింత ప్రాణం పోసేవిగా ఉంటాయని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.ప్రభాస్‌ ద్విపాత్రాభినయంలో నటించిన ఈ చిత్రంలో రానా విలన్‌గా నటిస్తున్నాడు.

అనుష్క, తమన్నాలు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు.ప్రస్తుతం చివరి దశ షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే సంవత్సరం ఏప్రిల్‌లో విడుదలకు సిద్దం అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube