అమ్మా నాన్న లతో సమంత

సమ్మర్ సీజన్ లో నాలుగు సినిమాలు సమంత వి విడుదల అయ్యాయి.వాటిల్లో బ్రహ్మోత్సవం పక్కన పెడితే మిగిలిన సినిమాలు పోలీసోడు , 24 , అ ఆ మూడూ హిట్ లు గా నిలిచాయి.

 Actress Samantha Tour With Parents-TeluguStop.com

ఆమె కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జనతా గ్యారేజ్ షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది సమ్మీ .ప్రస్తుతం ఆ సినిమాలో ఒక పాట షూటింగ్ బాకీ ఉండగా ఆమె పేరెంట్స్ తో కలిసి టూర్ ప్లాన్ చేసింది.హాలిడేస్ ఎంజాయ్ చేస్తోంది ప్రస్తుతం ఆమె.

నిన్న మొన్నటివరకూ బాయ్‌ఫ్రెండ్‌తో చెట్టాపట్టాలేసుకొని షాపింగ్ చేస్తూ బిజీగా కనిపించిన సమంత, ఇప్పుడు తల్లిదండ్రులతో సెలవులను గడుపుతున్నారు.ఎక్కువగా తన కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫోటోలేవీ పోస్ట్ చేయని ఆమె, తాజాగా అమ్మా, నాన్నలతో కలిసి దిగిన ఓ ఫోటోను పోస్ట్ చేయడం విశేషంగా చెప్పుకోవచ్చు.ఇక సమంత నటించే సినిమాల విషయానికి వస్తే, ఈమధ్యే ‘వాడ చెన్నై’ అనే ఓ క్రేజీ ప్రాజెక్టు నుంచి తప్పుకున్న ఆమె, త్వరలోనే తన కొత్త ప్రాజెక్టు ఏంటన్నది తెలియజేస్తానన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube