Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

తిండి వద్దు శృంగారం కావాలంటున్న సమంత-Samantha Prefers $ex Over Food

సమంత దక్షిణాది నటి అయినా, టాలివుడ్ లో ఉన్న బాలివుడ్ నటిలా అనిపిస్తూ ఉంటుంది. అలానే ఉంటాయి మరి తన బోల్డ్ సమాధానాలు. నాగచైతన్య కాస్త బిడియంగా, మొహమాటంగా ఉంటాడు కాని సమంత అలా కాదు. ఎప్పుడు ముక్కుసూటి వ్యవహారమే. మహేష్ బాబు లాంటి స్టార్ సినిమా పోస్టర్ మీద కామెంట్ చేయడం కాని, సిద్ధార్థ్ తో బ్రేకప్ అయిన తరువాత ట్విట్టర్ లో పబ్లిక్ గానే తనపై దండయాత్ర చేయడం కాని, ఎప్పుడు దగ్గరే ఉండే వస్తువులు ఏమిటి అంటే అండర్ వియర్ అని చెప్పడం కాని, ఇలా చెప్పుకునే ఎన్నో ఇంకెన్నో. అంతదాకా ఎందుకు, సమంత స్వయంగా చెప్పేదాకా నాగచైత్యన్యతో ఈ అమ్మడు నడుపుతున్న ప్రేమాయాణం కూడా బయట జనాలకి తెలియదు. అందుకే అన్నాడు నాగచైతన్య, సమంతలా ఉండటం తనవల్ల కాదు, నాకు మొహమాటం, బిడియం ఎక్కువ అని.

ఇప్పుడు కొత్తగా ఏం చేసింది సమంత ? అదే JFW మ్యాగజీన్ కి ఒక హాట్ ఫోటోశూట్ చేసింది కదా. ఆ మ్యాగజీన్ ఒక బోల్డ్ ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది సామ్. అందులో తిండి కావాలా శృంగారం కావాలా అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ, కాసేపు తేల్చుకోలేక సతమతమైన సమంత, ఆ తరువాత శృంగారనికే ఓటు వేసింది. ఏ రోజైనా తిండి మీదా శృంగారాన్నే కోరుకుంటానని చెప్పింది. అదే ఇంటర్వ్యూలో నాగచైతన్యలోని స్టెబిలిటి ని పొగిడిన సమంత, తను పెర్ఫెక్ట్ అని, ఎలాంటి బలహీనతలు, నచ్చని విషయాలు లేవని చెప్పింది.

అసలే ఈ ఫోటో షూట్ తో అక్కినేని అభిమానులకి ఆగ్రహం తెప్పించింది. త్వరలో పెళ్లి పెట్టుకొని ఇప్పుడు ఇలాంటి ఫోటోలు ఎందుకు అంటూ సోషల్ మీడియాలో తెగ పడుతున్నారు సమంత మీద. ఇక ఇలాంటి బోల్డ్ ఇంటర్వ్యూలు, బోల్డ్ సమాధానాలు చూస్తే ఇంకెలా ఫీల్ అవుతారో. ఏదేమైనా, సమంతకి చైతన్య సపోర్ట్ ఉంది. తనకి ఇష్టం వచ్చినప్పుడే గ్లామర్ ని వదిలిపెడుతుంది సమంత. అప్పటిదాకా అక్కినేని ఫ్యాన్స్ తమ ఎమోషన్స్ ని దాచిపెట్టుకోవడమే బెటర్.

Continue Reading
More Posts
To Top